బలయ్యేది నిర్మాతలు, హీరోయిన్లే..
సినిమా హిట్టయితే ప్రొడ్యూసర్ , హీరో, హీరోయిన్ ఇలా అందరికీ మంచి జరుగుతుంది. అదే సినిమా ఫెయిల్ అయితే మాత్రం బలయ్యేది హీరోయిన్లు, నిర్మాతలే అంటోంది హాట్ బ్యూటీ దీక్షాసేథ్. సినిమా పరాజయం పాలవడం వల్ల ఆర్థికంగా నిర్మాత నష్టపోతాడు. హీరోయిన్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. రకరకాలుగా కామెంట్ చేస్తారు. అసలు సినిమా ప్లాపవ్వడానికి కారణం తనే అయినట్లు మాట్లాడతారు. అవకాశాలు కూడా ఇవ్వరు. ఇది నిజంగా చాలా బాధా కరమైనర విషయం అంటూ.....తన మనసులోని మాటను బయట పెట్టింది ఈ భామ. సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఏ రంగంలోనైనా సహజమే అంటోంది.
సినిమాలు ప్లాపవడం వల్ల తనపై వస్తున్న కామెంట్లను నేను పట్టించుకోనని, ఈరోజు అలా అన్నవారే...ఒక్క సినిమా హిట్టయితే పొగిడేస్తారు అంటోంది. ప్రస్తుతం తాను తెలుగులో 'లెటర్', 'ఊకొడతారా...ఉలిక్కి పడతారా' చిత్రాల్లో నటిస్తున్నాను. తమిళంలో శింబుతో కలిసి 'వెట్టయ్ మన్నన్' అనే చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చిన దీక్షా...ఈ మూడు సినిమాలపై నమ్మకం ఉంది, అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. మరి విజయం కోసం పరితపిస్తున్న దీక్షసేథ్ దీక్ష ఫలించాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











