»   » 'అపరిచితుడు', 'ఒకేఒక్కడు' లాంటిదికాదు: శేఖర్ కమ్ముల

'అపరిచితుడు', 'ఒకేఒక్కడు' లాంటిదికాదు: శేఖర్ కమ్ముల

Posted By:
Subscribe to Filmibeat Telugu

నా సినిమా 'అపరిచితుడు', 'ఒకేఒక్కడు', 'మల్లన్న' చిత్రాల వంటిది కాదు. ఇది వేరే తరహా చిత్రం అంటున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వం వహించిన లీడర్‌ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో జరిగింది..రాణాని హీరోగా పరిచయం చేస్తూ తీసిన ఈ చిత్రం అందరి మన్ననలు అందుకుంటోందని ఆయన చెప్పారు. అలాగే 'ఇంత వరకు నా చిత్రాలు విజయం కావాలని నేనెప్పుడూ దేవుడికి దణ్ణం పెట్టుకోలేదు. తొలిసారి 'లీడర్‌' విజయవంతం కావాలని దేవుణ్ని కోరుకున్నాను అన్నారు శేఖర్‌ కమ్ముల.

ఈ చిత్రాన్ని నిర్మించిన ఏవీయమ్‌ సంస్థ వారికి కృతజ్ఞతలు. రానాను నా చేతిలో పెట్టినందుకు రామానాయుడు కుటుంబానికి ధన్యవాదాలు. ఈ చిత్రం నిండా నా ఆవేదనను అందరికీ చెప్పాను. 'లీడర్‌'ను అన్ని రంగాల వారూ చూశారు. 'చాలా ధైర్యంగా తీశావు' అని రామోజీరావుగారు మెచ్చుకున్నారు. 'నీకు రాజకీయాల మీద ఇంత అవగాహన ఉందా?' అని చిరంజీవి అడిగారు. మోహన్‌బాబు పుష్పగుచ్ఛం పంపించి ప్రశంసించారు. నా దేశం గురించి నా ప్రజలకు అర్జీ పెట్టుకున్నాను. దాదాపు కోటి మంది ప్రజలు నా చిత్రాన్ని చూశారు. ఆదరించారన్నారు.

ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు, రమేష్‌ ప్రసాద్‌, సురేష్ ‌బాబు, ఎమ్మెస్‌ రాజు, జెమిని కిరణ్‌, ఠాగూర్‌ మధు, బి.గోపాల్‌, చిన్నికృష్ణ, రిచా గంగోపాధ్యాయ్‌, ప్రియా ఆనంద్‌, పరుచూరి బ్రదర్స్‌, బెల్లంకొండ సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu