»   » 2016 టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్, హిట్స్... (లిస్ట్)

2016 టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్, హిట్స్... (లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2016 సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమకు ఊరట నిచ్చిందనే చెప్పాలి. అంతకు ముందుతో పోలిస్తే 2016 సంవత్సరం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, హిట్ చిత్రాల సంఖ్య పెరిగింది.

పెట్టిన పెట్టుబడిని అవలీలగా రాబట్టి, నిర్మాతలు ఊహించని లాభాలు తెచ్చి పెడితే ఆ సినిమా బ్లాక్ బస్టరే. 2016 దాదాపు ఆరు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ జాబితాలో చేరాయి. అందులో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీ టాప్ లో ఉంది.


సూపర్ హిట్స్, హిట్స్ గా నిలిచిన చిత్రాల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఓవరాల్ గా చూసుకుంటే 2016 సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' చిత్రం టాప్ ప్లేసులోఉంది.


జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్' మూవీ 2016 పెద్ద హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ సూళ్లు సాధించిన చిత్రంగా చరిత్రకెక్కింది.


సరైనోడు

సరైనోడు

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు' మూవీ 2016లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది.


సోగ్గాడే చిన్ని నాయనా

సోగ్గాడే చిన్ని నాయనా

నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా 2016లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రాల లిస్టులో మూడో స్థానం దక్కించుకుంది.


బిచ్చగాడు

బిచ్చగాడు

విజయ్ ఆంటోనీ హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రం తెలుగులో ‘బిచ్చగాడు'గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ కేవలం రూ. 50 లక్షలకు కొన్నారు. ఈ చిత్రం తెలుగు బాక్సాఫీసు వద్ద దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసింది.


పెళ్లి చూపులు

పెళ్లి చూపులు

విజయ్ దేవరకొండను హీరోగా పరిచయం చేస్తూ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు' మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ చిత్రాల లిస్టులో ఈచిత్రం చోటు దక్కిచుకుంది.


ఎక్కడికి పోతావు చిన్నవాడా

ఎక్కడికి పోతావు చిన్నవాడా

నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం 30 రోజుల్లో రూ. 30 కోట్లు వసూలు చేసి నిఖిల్ కెరీర్లోనే భారీ విజయం సాధించిన చిత్రంగా నిలిచింది.


నేను శైలజ

నేను శైలజ

రామ్-కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘నేను శైలజ' మూవీ 2016 సంవత్సరం ప్రారంభంలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం 2016 సంవత్సరం తొలి హిట్ గా రికార్డులకెక్కింది.


క్షణం

క్షణం

అడవిశేష్, అనసూయ తదితరులు నటించిన ‘క్షణం' చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల లిస్టులో చోటు దక్కిచుకుంది.


ప్రేమమ్

ప్రేమమ్

నాగ చైతన్య హీరోగా ఈ ఏడాది వచ్చిన మళయాలం రీమేక్ మూవీ ‘ప్రేమమ్' 2016 టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.


ఈడో రకం ఆడో రకం

ఈడో రకం ఆడో రకం

మంచు విష్ణు, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఈడో రకం ఆడో రకం' చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.


జ్యో అచ్చుతానంద

జ్యో అచ్చుతానంద

నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జ్యో అచ్యుతానంద' మూవీ 2016 టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.


అ..ఆ

అ..ఆ

నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యో అచ్చుతానంద' మూవీ 2016 టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.


మణ్యంపులి

మణ్యంపులి

మోహన్ లాల్ హీరోగా మళయాలంలో తెరకెక్కిన చిత్రం తెలుగులో ‘మణ్యంపులి' గా విడుదలై సూపర్ హిట్ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.


నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం 2016 హిట్ చిత్రాల్లో చోటు దక్కించుకుంది.


ధృవ

ధృవ

రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తమిళ రీమేక్ మూవీ ‘ధృవ' 2016 హిట్ చిత్రాల్లో చోటు దక్కించుకుంది.


కృష్ణ గాడి వీర ప్రేమాగాధ

కృష్ణ గాడి వీర ప్రేమాగాధ

నాని హీరోగా 2016లో వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమాగాధ చిత్రం కూడా హిట్ చిత్రంగా నిలిచింది.


శ్రీరస్తు శుభమస్తు

శ్రీరస్తు శుభమస్తు

అల్లు శిరీస్ హీరోగా వచ్చిన శ్రీరస్తు శుభమస్తు మూవీ 2016లో వచ్చిన హిట్ చిత్రాల జాబితాలో చోటు దక్కిచుకుంది.


సుప్రీమ్

సుప్రీమ్

సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘సుప్రీమ్' చిత్రం 2016లో వచ్చిన హిట్ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.


24

24

తమిళ స్టార్ సూర్య హీరోగా అనువాద చిత్రం ‘24' చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించింది.


జెంటిల్మెన్

జెంటిల్మెన్

నాని హీరోగా వచ్చిన ‘జెంటిల్మెన్' మూవీ 2016 సంవత్సరంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.


ఎక్స్‌ప్రెస్ రాజా

ఎక్స్‌ప్రెస్ రాజా

శర్వానంద్ హీరోగా వచ్చిన ఎక్స్ ప్రెస్ రాజా మూవీ 2016లో వచ్చిన హిట్ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.


English summary
Hit ratio of Tollywood is very encouraging in 2016. While 'Janatha Garage' stood as the biggest grosser, 'Sarrainodu' emerged as the film which had most number of 50 Days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu