మిస్టర్ ఫర్ ఫెక్ట్ సక్సెస్ సీక్రెట్స్ ఏమిటంటే...!?
2010 సంవత్సరంలో డార్లింగ్ రూపంలో సైలెంట్ హిట్ కొట్టినా..ప్రభాస్ ఈ సంవత్సరం వేసవికి కూడా అదే తరహాలో 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" రూపంలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వాస్తవానికి మిస్టర్ ఫర్ ఫెక్ట్ లో కొత్తగా ఏమీ లేనప్పటికీ..ఆడియెన్స్ ను రెండున్నర గంటలు కూర్చోబెట్టడంలో దిల్ రాజు, దశరథ్ లు సక్సెస్ అయ్యారు. సెన్సిబుల్ సినిమాలు తెరకెక్కించడంలో అనుభవం గల దశరత్ ఈ సినిమాలో పతాక సన్నివేశాల్లో ఫీల్ ను బాగా వర్కవుట్ చేశాడని ప్రశంసలు దక్కుతున్నాయి.
అంతే కాదు ఈ వేసవి సీజన్ ఈ చిత్రానికి వరంగా మారనుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు ముగియడం ఈచిత్రం హిట్ నిలబడటంలో ఒక కారణంగా అందరూ చెప్పుకుంటున్నారు. శక్తి ప్లాప్ అవ్వడం, తీన్ మార్ కు కూడా కలెక్షన్స్ తగ్గడం కూడా ఈ మిస్టర్ ఫర్ ఫెక్ట్ కు కలిసొచ్చే అంశాలు. మెలోడీ ప్లస్ మాస్ ని ఆకట్టుకునే విధంగా 'మిస్టర్ పెర్ ఫెక్ట్" సినిమాకి మంచి ట్యూన్స్ ఇచ్చి, డియస్ పి మరోసారి తన సత్తా చాటాడని అంటున్నారు. సో మొత్తం మీద ప్రభాస్ పబ్లిసిటిలో ఎటువంటి హడావుడి చేయకుండానే మరో హిట్ ను కొట్టాడని ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











