పవిత్ర నా భార్య.. సహజీవనం ఏంటి? నరేష్ ఎవరో కూడా తెలియదన్న సుచేంద్ర ప్రసాద్
సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ గత కొద్దిరోజుల నుంచి మీడియాలో నానుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుమాన పడుతున్న నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వారిద్దరూ కలిసి ఉన్న హోటల్ వద్దకు వెళ్లి వారి మీద దాడి చేయటానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. అయితే పవిత్ర లోకేష్ స్టింగ్ ఆపరేషన్ లో తాను నరేష్ తో సహజీవనం చేస్తున్నానని పేర్కొన్నట్టు ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆ విషయం మీద సుచేంద్ర ప్రసాద్ స్పందించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

స్నేహితుల ద్వారా
తనకు వివాహం జరగలేదని సుచేంద్ర ప్రసాద్ తో కూడా సహజీవనమే చేశానని పవిత్రా లోకేష్ పేర్కొన్నట్టు ప్రచారం జరగగా తాజాగా ఆమె తన భార్య అంటూ సుచేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. అసలు నరేష్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని తాజాగా కన్నడ మీడియాతో ఆయన పేర్కొన్నట్టు సమాచారం. తన భార్యతో సంబంధాలపై మీడియా, కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని సుచేంద్ర ప్రసాద్ లోకల్ మీడియాతో మాట్లాడారు అని తెలుస్తోంది.

ఆధారాలు ఉన్నాయని
నరేష్ తో పవిత్ర రిలేషన్ వివాదంగా మారిన నేపథ్యంలో ఆమె భర్త, కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ కన్నడ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు చెప్పారని తెలుస్తోంది. పవిత్ర చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నట్టు తాము సహజీవనం చేయడం నిజం కాదని 16 ఏళ్ల క్రితం హిందూ వివాహచట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నామని సుచేంద్ర ప్రసాద్ తెలిపారు. తామిద్దరం దంపతులమని రుజువు చేసే ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన వివరించారు.

నేనేం అనలేదు
తన పాస్‌పోర్టులో భార్యగా పవిత్ర పేరు, అలాగే ఆమె పాస్‌పోర్టులో భర్తగా తన పేరు నమోదైనట్టు సుచేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆధార్‌కార్డులో కూడా భార్య భర్తలుగా తమ పేర్లు నమోదయ్యాయని సుచేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు, అలాగే తమ ప్రేమకు, దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. అంతేకాక తాను పవిత్రను ఉద్దేశించి ఏవో కామెంట్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోందని, తాను ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర కామెంట్స్ చేయలేదని సుచేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

అర్ధం కావడం లేదు
పవిత్రాపై ఇప్పటికీ తనకు గౌరవం ఉందని.. ఈ అన్ని వ్యవహారాల వెనుక ఎవరో ఉన్నారని సుచేంద్ర ప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు. తనతో పెళ్లి జరగలేదని.. కేవలం సహజీవనం చేశామని, ఆ తరువాత విడిపోయామని పవిత్ర ఎందుకు చెప్పిందో కూడా తనకు అర్ధం కావడం లేదని సుచేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

నరేష్ ఎవరో తెలియదు
ఇక తాను సంప్రదాయవాదినని, సహజీవన విధానంపై నమ్మకాలు లేవని పేర్కొన్న సుచేంద్ర ప్రసాద్ పదహారేళ్లుగా పవిత్రాతో కలిసి జీవిస్తున్నట్లు కర్ణాటక ప్రజలందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవిత్ర కలిసి ఉంటున్న నటుడు నరేష్ ఎవరో, ఆయనతో ఉన్న సంబంధాల గురించి నిజంగా తనకు తెలియదని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఈ విషయం మీద పవిత్ర ఎలా స్పందిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











