twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మైసూర్‌లో పట్టుబడిన తర్వాత భర్తకు పవిత్ర ఫోన్.. అసలు విషయం బయటపెడతానన్న సుచేంద్ర ప్రసాద్

    |

    పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ వివాహం చేసుకునే అవకాశం ఉందని ఇప్పటికే సహజీవనం చేస్తున్నారని, వివాహం చేసుకోకుండా సహజీవనం చేయాలని అనుకుంటున్నానని అంటూ ఇలా ఎవరికి తోచిన కథనాలు రాస్తూ వెళ్లడం గురించి తెలిసిందే. అయితే తాజాగా లోనికి రూమ్ లో వీరిద్దరూ కలిసి నరేష్ భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఈ ఘటన జరిగిన తర్వాత తన భార్య తనకు ఫోన్ చేసిందంటూ పవిత్ర భర్త సుచేంద్ర ప్రసాద్ కామెంట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    అలా అనలేదు

    అలా అనలేదు

    పవిత్ర లోకేష్ మంచిది కాదని ఆమెకు కాపురాలకు ఇచ్చే బుద్ధి ఉందని డబ్బు కోసమే ఆమె దేనికైనా రెడీ అవుతుంది అంటూ సుచేంద్ర ప్రసాద్ కన్నడ మీడియాలో కామెంట్ చేసినట్టు మన మీడియాలో వార్తలు వచ్చాయి. కన్నడ మీడియాలో ఆయన ఏం మాట్లాడారో తెలియదు కానీ తెలుగు మీడియాలో మాత్రం ఆయన పవిత్ర క్యారెక్టర్ మంచిది కాదని కామెంట్ చేసినట్లు నరేష్ ను ఒకవేళ పవిత్ర వివాహం చేసుకున్నా సరే ఆ వివాహం ఆరు నెలలకు మించి ఉండదని కామెంట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

    అవగాహన లేదని

    అవగాహన లేదని

    అయితే ఇప్పుడు మాత్రం ఆయన దానికి భిన్నంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన పవిత్రను వెనకేసుకు వస్తూ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. పవిత్ర లోకేష్ చాలా మంచిదని, నరేష్ ఎవరో తనకు తెలియదని ఆయన కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన భార్య రమ్య గురించి తాను మీడియాలో వినడమే తప్ప వారి గురించి తనకు అసలు ఏమాత్రం అవగాహన లేదని ఆయన చెప్పుకొచ్చారట.

    ఎందుకు అన్నారో

    ఎందుకు అన్నారో

    అంతేకాక తన భార్య మీద తనకు నమ్మకం ఉందని మైసూర్లో ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఆమె తనతో ఫోన్లో మాట్లాడి వివరణ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చినట్లు సమాచారం. తామిద్దరం భార్యాభర్తలము కాదు అని ఆమె ఒక స్టింగ్ ఆపరేషన్ లో చెప్పినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఆ మాటలు ఆవిడ ఎందుకు అన్నారో తనకు తెలియదని అన్నారు.

    సర్టిఫికెట్ లేదు

    సర్టిఫికెట్ లేదు

    మేమిద్దరం భార్యాభర్తలమే అని హిందూ సాంప్రదాయాల ప్రకారమే తమకు వివాహం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న వారు మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకోరు కాబట్టి మా దగ్గర అది లేదని అన్నారు. కానీ పాస్పోర్ట్ లో, ఆధార్ కార్డులో సైతం భర్తగా తన పాస్పోర్ట్ లో నా పేరు, భార్యగా నా పాస్పోర్ట్ లో ఆమె పేరు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

    Recommended Video

    హ్యాపీ బర్త్ డే చెప్పి మత్తు వదిలించావ్ గా *Reviews | Telugu OneIndia
    ఎవరో కూడా తెలియదంటూ

    ఎవరో కూడా తెలియదంటూ

    ఇవి కాక తమ పెళ్ళి జరిగినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయని అవసరమైతే వాటిని కూడా బయటపెడతానని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. పవర్ టివి రాజేష్ శెట్టితో అధినేతతో రమ్యకు ఎఫైర్ ఉందంటూ నరేష్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో అసలు ఆయన ఎవరో కూడా తనకు తెలియదంటూ సుచేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇంకా ఎంత దూరం వెళుతుంది అనేది చూడాల్సి ఉంది.

    English summary
    Suchendra prasad revealed that pavitra called him after mysore incident, and says that he had proofs for marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X