twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎలా వెళ్లానో అలాగే వచ్చా: 'సుచీ లీక్స్' మళ్లీ స్టార్ట్.. రాసలీలు రచ్చకీడుస్తానంటూ..

    |

    Recommended Video

    'సుచీ లీక్స్' మళ్లీ స్టార్ట్.. రాసలీలు రచ్చకీడుస్తానంటూ..!

    సుచీ లీక్స్.. గతేడాది తమిళ నటీనటుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పేరు ఇది. కొన్ని నెలలుగా సుచీ తెరపై లేకపోవడంతో ఆ నటీనటులంతా ప్రశాంతంగా ఉన్నారు. కానీ 'ఐయామ్ బ్యాక్' అంటూ సుచీ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇప్పుడు వాళ్ల గుండెలు అదిరిపడేలా చేస్తోంది. సుచీ మళ్లీ ఏం లీక్ చేసి ఎవరి కొంప ముంచుతుందోనన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది.. ఇంతకీ సుచీ ఏమందంటే..

     'ఎలా వెళ్లానో అలాగే వచ్చా..':

    'ఎలా వెళ్లానో అలాగే వచ్చా..':

    'ఎలా వెళ్లానో మళ్లీ అలాగే వచ్చా.. పలువురు నటీనటుల ఆంతరంగిక వ్యవహారాలు మళ్లీ విడుదల కానున్నాయి' అని పేర్కొంటూ మరోసారి సుచిత్ర బాంబు పేల్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    స్టార్స్‌కు ముచ్చెమటలు:

    స్టార్స్‌కు ముచ్చెమటలు:

    సుచిత్ర తాజా ట్వీట్ కోలీవుడ్ స్టార్స్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. సుచిత్ర చేతిలో ఎవరు బలికాబోతున్నారు? అన్న చర్చ కూడా అప్పుడే మొదలైంది. హీరో-హీరోయిన్ల ఎఫైర్స్ వీడియోలను సుచీ లీక్ చేస్తానని చెప్పడం ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేసేదిగా మారింది.

    సుచీ లీక్స్: హీరోయిన్ సమంతకు ఊరట, ఏం జరిగింది?సుచీ లీక్స్: హీరోయిన్ సమంతకు ఊరట, ఏం జరిగింది?

     అసలేం జరుగుతోంది?:

    అసలేం జరుగుతోంది?:

    గతేడాది సుచీ లీక్స్ బయటకొచ్చిన సందర్భంగా ఆమె మానసిక స్థితి సరిగా లేదన్న ప్రచారం కూడా జరిగింది. నిజంగా సుచిత్రకు అసలేమైంది?.. ఆమె ఎందుకలా చేస్తుంది? అన్న దానిపై మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. కోలీవుడ్ లోనూ ఎవరూ దీనిపై ఆరా తీసినట్లుగా లేరు.

     సుచిత్రకు ఏమైంది?;

    సుచిత్రకు ఏమైంది?;

    కేవలం హీరో ధనుష్‌తో తలెత్తిన గొడవల కారణంగానే సుచిత్ర.. ఈ 'లీక్స్'తో బ్లాక్ మెయిల్ చేస్తోందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే సుచిత్రకు వాళ్ల నుంచి తీరని అన్యాయం ఏమైనా జరిగిందా?.. అందుకనే వారిపై ఇంతలా కక్ష కట్టిందా? అని అనుమానం వెలిబుచ్చుతున్నవారు కూడా లేకపోలేదు.

    హీరోయిన్ రాసలీలలు: మళ్లీ సుచీ లీక్స్, బెంభేలెత్తిపోతున్న స్టార్స్!హీరోయిన్ రాసలీలలు: మళ్లీ సుచీ లీక్స్, బెంభేలెత్తిపోతున్న స్టార్స్!

     సెల్వ రాఘవన్‌పై..:

    సెల్వ రాఘవన్‌పై..:

    సుచీ లీక్స్ లో భాగంగా ధనుష్ అన్న సెల్వరాఘవన్ ఓ హీరోయిన్ తో న్యూడ్ సినిమా చేశాడన్న విషయం అప్పట్లో లీకైంది. దీనికి సంబంధించి సదరు హీరోయిన్ నుంచి సెల్వ భార్యకు కూడా మెయిల్స్ వెళ్లాయని, ఆ సినిమా విడుదలవకుండా చూడాలని ఆమె ప్రాధేయపడినట్లుగా ప్రచారం జరిగింది.

     సమంతపై కూడా?

    సమంతపై కూడా?

    ఇక నాగచైతన్యతో పెళ్లి వైపుగా అడుగులు వేస్తున్న వేళ.. సమంతను కూడా అప్పట్లో సుచీ లీక్స్ బెంబేలెత్తించింది. సుచిత్ర సమంత వీడియోలను కూడా లీక్ చేయబోతుందన్న ప్రచారం ఊపందుకోవడంతో.. తదుపరి టార్గెట్ ఆమెనే అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అనుకున్నట్లుగా సమంత వీడియోలేమి సుచిత్ర లీక్ చేయలేదు.

    సుచీ లీక్స్ సుచిత్ర కిడ్నాప్ అయిందా?సుచీ లీక్స్ సుచిత్ర కిడ్నాప్ అయిందా?

     అమలాపాల్ స్పందన:

    అమలాపాల్ స్పందన:

    సుచీ లీక్స్ లో భాగంగా ధనుష్, అనిరుధ్, చిన్మయి, త్రిష, నయనతార, ఆండ్రియా తదితర స్టార్స్ ఎఫైర్స్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. కొంతమంది స్టార్స్ ఈ వ్యవహారాన్ని కొట్టిపారేశారు.

    ఇదే విషయంపై అప్పట్లో స్పందించిన అమలాపాల్ మాత్రం కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. 'నేను కూడా నా పేరుతో విడుదలయ్యే వీడియోని చూడాలని చాలా ఎదురుచూశాను. కానీ భాధాకరంగా ఆ అకౌంట్ డీయాక్టివేట్ అయిపొయింది' అని అమలాపాల్ అప్పట్లో పేర్కొన్నారు.

     సుచిత్ర భర్త ఏమన్నాడు?:

    సుచిత్ర భర్త ఏమన్నాడు?:

    తన భార్య మానసిక పరిస్థితి బాగా లేకనే ఇలా చేస్తోందని, ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని అప్పట్లో సుచిత్ర భర్త తెలిపారు. ఆ తర్వాత ఆమె ట్విట్టర్ ఖాతా కూడా క్లోజ్ అయిపోయింది. దీంతో ఈ వివాదం ఇక సద్దుమణిగినట్లేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు 'నేను మళ్లీ వచ్చేశాను..' అని సుచిత్ర బాంబు పేల్చడంతో కోలీవుడ్ స్టార్స్‌కు మళ్లీ భయం పట్టుకుందట. ఇంతకీ సుచిత్ర ఈసారి ఎవరిని టార్గెట్ చేయబోతుందో మరి?..

    English summary
    The 'Suchi Leaks' controversy, as it is being called, has created a stir in Kollywood.After months gap again she is back now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X