»   » మళ్లీ హీరోల గుండెల్లో గుబులు.. బ్లాక్ మెయిల్.. సుచీలీక్స్ పార్ట్2 ఉందట..

మళ్లీ హీరోల గుండెల్లో గుబులు.. బ్లాక్ మెయిల్.. సుచీలీక్స్ పార్ట్2 ఉందట..

Written By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హీరో, హీరోయిన్ల అశ్లీల ఫోటోలను గాయని సుచిత్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ధనుష్, త్రిష, రానా తదితరులు అతిసన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ రేపాయి. ఆ నేపథ్యంలో సుచిత్ర తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేశారని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Suchileaks

దక్షిణాది హీరో, హీరోయిన్లకు సంబంధించి విషయాలు అప్పట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఏ సమయంలో ఎవరి ఫోటోలు వస్తాయో అనే భయంతో తారలు గుండెను గుప్పిట్లో పెట్టుకొన్నారు. ఆ వివాదం సమయంలో తమిళనాడులో నెటిజన్లు ట్విట్టర్‌ను కూడా టెలివిజన్‌ చూసినట్టు చూశారనేది అప్పట్లో టాక్.

సోషల్ మీడియాలో కోలీవుడ్ హీరోల..

సోషల్ మీడియాలో కోలీవుడ్ హీరోల..

కోలీవుడ్ హీరో ధనుష్‌, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, గాయని చిన్మయి, హన్సిక, త్రిష, ఇతర నటీనటుల ఘాటైన వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ముచ్చెమటలు పట్టించింది సుచిత్ర. అయితే సుచీలీక్స్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన ట్విట్టర్ ద్వారా హ్యాకర్ ఈ పోస్టులు పెట్టినట్లు సుచిత్ర ఇటీవల తెలిపింది.

శత్రువులకైనా హాని

శత్రువులకైనా హాని

శత్రువులకైనా హాని తలెపెట్టను. ఇలాంటి చవకబారు పనులు చేయను అని సుచిత్ర వివరణ ఇచ్చింది. ఈ వివాదం వల్ల బాధపడిన ప్రముఖులకు ఇందులో తన ప్రమేయం లేకపోయినా క్షమాపణ చెప్తున్నానని వెల్లడించింది. తాజాగా సుచీలీక్స్-2పై వస్తున్న వార్తలకు సుచీకి సంబంధం లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు.

తాజాగా మరోసారి సుచీలీక్స్ పార్ట్2

తాజాగా మరోసారి సుచీలీక్స్ పార్ట్2

తాజాగా మరోసారి సుచీలీక్స్ పార్ట్2 తెరపైకి రానున్నదని వార్తలు రావడంతో కోలీవుడ్‌లో మరోసారి ఆందోళన నెలకొన్నది. మళ్లీ హ్యాకర్లు విజృంభించేందుకు సిద్ధమవుతున్నారనేది ఆ రూమర్ సారాంశం. సుచీలీక్స్‌కు సంబంధించి మ‌ళ్లీ అలాంటి ఫొటోలు, వీడియోలు ట్విట్ట‌ర్లో పెట్ట‌కుండా కొందరు హ్యాకర్లకు స్టార్ హీరో, హీరోయిన్లు కొంత సొమ్ము ముట్టచెప్పారనేది అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి.

హీరో, హీరోయిన్లను బెదిరిస్తే

హీరో, హీరోయిన్లను బెదిరిస్తే

హీరో, హీరోయిన్లను బెదిరిస్తే మరింత డబ్బు చేతికి అందవచ్చనే ప్లాన్‌తో హ్యాకర్లు సుచీలీక్స్2 ప్రణాళిక రచిస్తున్నారట. ఈ మేరకు కొందరు హీరోయిన్లు, హీరోలను హ్యాకర్లు బెదిరిస్తున్నట్టు సమాచారం. డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వకపోతే సోషల్ మీడియాలో సీక్రెట్ ఫోటోలు, వీడియోలను పెడుతామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

సుచీలీక్స్ వ్య‌వ‌హారం ముగిసిందని

సుచీలీక్స్ వ్య‌వ‌హారం ముగిసిందని

సుచీలీక్స్ వ్య‌వ‌హారం ముగిసిందని అనుకుంటున్న లోపే మ‌ళ్లీ సుచీలీక్స్ పార్ట్-2 రంగంపైకి రావడం ప్రముఖ తారలకు ముచ్చెమటలు పడుతున్నాయి. హ్యాకర్లు ఎప్పుడు విజృంభిస్తారో తెలిక స్టార్ హీరోలు, హీరోయిన్ల‌కు నిద్ర పట్టడం లేదట. హ్యాకర్ల జాబితాలో ఎవరు ఉన్నారో తెలియక లోలోపల భయపడుతున్నారట. సుచీలీక్స్ ఆపడానికి హాకర్లు అడిగిన మొత్తాన్ని కోలీవుడ్ స్టార్లు స‌మ‌ర్పించుకుంటారా లేదా సుచీలీక్స్ వ్య‌వ‌హారాన్ని తెర‌మ‌రుగు చేసేందుకు ఏవైనా చ‌ర్య‌లు తీసుకుంటారా అనే అంశాలపై చర్చ జరుగుతున్నది.

English summary
SuchiLeaks, the recent controversy has shaken the entire Tamil film fraternity. Much to the disappointment of many, controversial pictures and videos of certain Tamil celebrities have gone viral on the internet. Now there is a new that.. Part2 of suchileaks is getting ready by hackers
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu