నా కోరిక తీరుస్తావా? అన్నాడు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

సోషల్ మీడియా వేగంగా విస్తరించడం కారణంగా కొన్ని అనుకోని అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు వల్గారిటీ ప్రదర్శిస్తున్నారు. ఈ మేరకు సదరు సెలెబ్రెటీలకు నేరుగా ట్యాగ్ చేస్తూ అసభ్యకర సందేశాలు పంపుతున్నారు. సైబర్ ఉచ్చులో తెలిసి చేస్తున్నారో, లేక తెలియక చేస్తున్నారో గానీ ఇలాంటి సందేశా మూలంగా సెలెబ్రిటీల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ మెసేజీలు పోలీసుల వరకూ వెళ్లి నెటిజన్లకు తగిన శిక్ష పడేలా చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాలు చూస్తే..

నటికి అసభ్యకర మెసేజ్

నటికి అసభ్యకర మెసేజ్

ప్రముఖ బాలీవుడ్‌ నటి, గాయకురాలు సుచిత్రా కృష్ణమూర్తికి సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా అసభ్యకర మెసేజ్ పంపించాడు ఓ విదేశీయుడు. లాకోస్టా మాఫిసా అనే విదేశీయుడి నుంచి నా కోరిక తీరుస్తావా? అనే సందేశం రావడం చూసి షాకైన నటి.. వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ట్వీట్

ఆ విదేశీయుడు తనకు తాను నేషనల్‌ క్రైమ్‌ ప్రివెన్షన్‌ కౌన్సిల్‌ లో ఉద్యోగస్తుడిగా ఫేస్ బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో అతడు పంపిన అసభ్యకర సందేశం, ప్రొఫైల్ స్క్రీన్ షాట్ తీసి ముంబయి పోలీసులకు, సోషల్ మీడియా సెల్ కి ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ చేసింది నటి సుచిత్రా కృష్ణమూర్తి.

పోలీసుల స్పందన.. 100కి కాల్ చేయండి

పోలీసుల స్పందన.. 100కి కాల్ చేయండి

నేషనల్‌ క్రైమ్‌ ప్రివెన్షన్‌ కౌన్సిల్‌ లో ఉద్యోగస్తుడిగా పనిచేస్తూ ఓ మహిళతో ఇలా ప్రవర్తిస్తున్నాడు చూడండి అని సుచిత్ర పేర్కొంది. దీంతో వెంటనే స్పందించిన ముంబై పోలీసులు.. మీ కేసుపై విచారణ చేపడతాం.. మిగితా వివరాలేమైనా ఉంటే తొందరగా పంపించండి. ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటే 100 కి కాల్ చేయండి అని పేర్కొన్నారు.

ఆడపిల్లల పరిస్థితి ఏంటో మీరే చెప్పండి

ఆడపిల్లల పరిస్థితి ఏంటో మీరే చెప్పండి

అయితే పోలీస్ రెస్పాన్స్ చూసిన సుచిత్ర.. తిరిగి ట్వీట్ చేస్తూ.. ''ఆడపిల్ల ప్రాబ్లమ్ పట్ల ఇంత త్వరగా స్పందించినందుకు ధన్యవాదాలు చెబుతున్నా. కేవలం మీ దృష్టికి తీసుకురావడానికి మాత్రమే ఈ విషయం చెప్పాను. నాకు ఎలాంటి ముప్పు లేదు కానీ.. నాలాంటి వారికే ఇలాంటి సందేశాలు వస్తే ఇక సోషల్‌మీడియా లోని ఇతర ఆడపిల్లల పరిస్థితి ఏంటో మీరే చెప్పండి'' అని పేర్కొంది.

సుచిత్రా కృష్ణమూర్తి

సుచిత్రా కృష్ణమూర్తి

శేఖర్ కపూర్ అనే ఫిలింమేకర్ ని వివాహమాడింది సుచిత్రా కృష్ణమూర్తి. వీరిద్దరికి ఒకరు సంతానం. డోలె డోలె, దుం తార, అహా, జిందగీ అనే ఆల్బమ్స్ ద్వారా బాగా ఫేమస్ అయింది సుచిత్రా కృష్ణమూర్తి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X