twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేపిస్టుల కాపిటల్ అంటే ఆశ్చర్యం లేదు: పోలీసులకు నటి ఫిర్యాదు

    నటి సుచిత్ర కృష్ణమూర్తి పోలీసులను ఆశ్రయించారు. ట్విట్టర్లో తనపై చేసిన అభ్యకామెంట్స్‌పై ఫిర్యాదు చేశారు.

    By Bojja Kumar
    |

    నటి, సింగర్ సుచిత్ర కృష్ణ మూర్తి ఇటీవల 'ఆజాన్' గురించి చేసిన ట్వీట్ పెద్ద వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. మసీదుల నుంచి వచ్చే ఆజాన్‌(నమాజ్‌ పిలుపు) శబ్దానికి చెవులు పగిలిపోతున్నాయంటూ ఆమె ట్వీట్ చేశారు.

    మత వివాదం: గుండు కొట్టించుకుని సోనూ నిగమ్ సంచలనం!మత వివాదం: గుండు కొట్టించుకుని సోనూ నిగమ్ సంచలనం!

    మతతత్వాన్ని ఇలా ఇతరులపై ప్రదర్శించడం కంటే మూర్ఖమైన పని మరొకటి ఉండదని కూడా ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే సుచిత్ర కృష్ణమూర్తి ట్వీట్ నేపథ్యంలో కొందరు వ్యక్తులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో దాడి చేశారు. అందులో కొందరు ఆమెను ట్విట్టర్లో లైంగికంగా వేధించడం, బెదిరించడం లాంటివి చేయడం గమనార్మం. ఓ నెటిజన్ రేప్ చేస్తానంటూ బెదిరించినట్లు సమాచారం.

    పోలీసులకు ఫిర్యాదు

    ట్విట్టర్లో తనను అసభ్య పదజాలంతో దూషించడం, లైంగిక వేధింపులు, బెదిరించడం లాంటివి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. బుధవారం ముంబైలోని ఓషివరా పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.

    నా దేశాన్ని చూస్తే జాలేస్తోంది

    నెటిజన్లు చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను ఫొటో తీసిన సుచిత్ర వాటిని ట్విటర్‌లో పెట్టారు. ‘ఈ వ్యాఖ్యలు చూడండి. నా దేశాన్ని చూస్తే జాలేస్తోంది. మహిళల పట్ల ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నపుడు మన దేశం రేప్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అవుతుందని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అని ట్వీట్ చేశారు.

    కేసు నమోదు చేసిన పోలీసులు

    కేసు నమోదు చేసిన పోలీసులు

    సుచిత్ర కృష్ణ మూర్తి ఫిర్యాదు స్వీకరించిన ముంబై ఓషివరా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 509, 67(ఎ) కింద కేసు నమోదు చేశారు.

    గతంలో సోనూ నిగమ్

    గతంలో సోనూ నిగమ్

    గతంలో సింగర్ సోనూ నిగమ్ కూడా ‘ఆజాన్' విషయంలో ఇలాగే ట్వీట్ చేసి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ఆయన అప్పట్లో గుండుకొట్టించుకోవడం సంచలనం అయింది.

    English summary
    Suchitra Krishnamoorthi, who had recently tweeted against the "aggressive/ear shattering call" for 'azaan', Wednessday lodged a police complaint against the "abusive" tweets posted by netizens in response to her remarks, an official said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X