»   » సుచిత్ర లేటెస్ట్ లీక్స్.. ఆందోళనలో హీరో ఆర్య .. ప్రముఖుల గజగజ.. నమ్మొద్దు..

సుచిత్ర లేటెస్ట్ లీక్స్.. ఆందోళనలో హీరో ఆర్య .. ప్రముఖుల గజగజ.. నమ్మొద్దు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుచిత్ర లేటెస్ట్ లీక్స్.. ఆందోళనలో హీరో ఆర్య .. ప్రముఖుల గజగజ.. నమ్మొద్దు..

సోషల్ మీడియాలో తమిళ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన శృంగార చిత్రాలను గాయని సుచిత్ర చేయడం కోలివుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. ఇటీవల హీరోలు ధనుష్, రానా, హీరోయిన్లు హన్సిక, త్రిష, గాయని చిన్మయి, సంగీత దర్శకుడు అనిరుధ్‌కు సంబంధించిన చిత్రాలను ఇటీవల ట్విట్టర్‌లో లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధనుష్‌కు హీరో ఆర్య అండగా నిలబడ్డారు.

 ట్విట్టర్‌ను కూడా టెలివిజన్‌లా చూస్తున్నారు

ట్విట్టర్‌ను కూడా టెలివిజన్‌లా చూస్తున్నారు

సుచి లీక్స్ నేపథ్యంలో సినీ అభిమానులు ట్విట్టర్‌ను కూడా టెలివిజన్‌లా చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రతీ రోజు ఎలాంటి సంచలనాలను లీక్ చేస్తుందో, లేదా ఫోటోలను, వీడియోలను ట్వీట్ చేస్తుందో అని మీడియా ఎదురుచూడటం ఒక వంతుగా మారింది.

సుచీ లీక్స్‌పై హీరో ఆర్య ఆందోళన

సుచీ లీక్స్‌పై హీరో ఆర్య ఆందోళన

సుచీ లీక్స్‌పై తమిళ హీరో ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. ‘సుచిత్ర లీక్ చేసే చిత్రాలన్నీ ఫేక్ ఫొటోలు, వీడియోలు. వాటిని ప్రజలు నమ్మవద్దు. ఇలాంటి చవకబారు ప్రచారం చేసి బెదిరించడం ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్‌లో ఇలాంటి నకిలీ వీడియోలు ఇంకా వస్తాయి. ఇలాంటి ఫేక్ వీడియోలతో ప్రచారం చేయడం సరికాదు' అని ఆర్య అన్నారు.

 ఫేక్ .. నమ్మితే మీ తప్పు.. నమ్మకండి

ఫేక్ .. నమ్మితే మీ తప్పు.. నమ్మకండి

‘ఇంటర్నెట్, యూట్యూబ్‌లో ఇలాంటి నకిలీ వీడియోలు ప్రచారం కావడం చాలా సహజం. అలాంటి వాటికి సినీ తారల పేర్లు జోడించడం వల్ల వైరల్‌గా మారుతాయి. బాధ్యతాయుత పౌరులుగా వాటినిక ఎంకరేజ్ చేయవద్దు. సుచిత్ర లీక్ చేస్తున్నవన్నీ నకిలీవని కచ్చితంగా చెప్తాను. ఒకవేళ మీరు నమ్మితే అది మీ తప్పు' అని ఆర్య చెప్పుకొచ్చారు.

సుచీ లీక్స్‌తో ధనుష్ అప్‌సెట్..

సుచీ లీక్స్‌తో ధనుష్ అప్‌సెట్..

సుచిత్ర లీక్స్ వల్ల ధనుష్ చాలా అప్‌సెట్‌గా ఉన్నారు. ప్రస్తుతం ధనుష్ దక్షిణాదిలో మంచి పేరు ఉన్న హీరో. ఆయన ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఓ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇది సరికాదు. మీడియాలో ధనుష్ ప్రతిష్ఠను మంటగలపడం సమంజసమా? ప్రేక్షకులకు, తమిళ సినీ అభిమానులకు వినోదం పంచుతున్న ఆయనకు ఇలాంటి టార్చర్ సరికాదు అని ఆర్య ఆవేదన వ్యక్తం చేశారు.

ఆందోళనలో హీరో ఆర్య.. అనేక సందేహాలు

ఆందోళనలో హీరో ఆర్య.. అనేక సందేహాలు

ఆర్య ఇలా తన సహచరులకు మద్దతుగా నిలువడం, నకిలీవని పేర్కొనడంపై ఈ వ్యవహారంలో ఆయనకేమైనా సందేహం ఉందా అనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఆర్య ప్రకటన కూడా మీడియాలో చర్చనీయాంశమైంది.

స్పందించని హీరో ధనుష్

స్పందించని హీరో ధనుష్

అటు సోషల్ మీడియాలోనూ, ఇటు మీడియాలోను రచ్చ జరుగుతున్నా హీరో ధనుష్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సుచీ లీక్స్‌పై ఏ పరిస్థితుల్లోనూ స్పందించడం లేదు. ప్రస్తుతం పవర్ పాండి, విఐపీ2 షూటింగ్‌లో బిజీగా ఉంటున్నారు. తాజాగా రిలీజైన బాషాపై స్పందించారు. సహజంగా నటులపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా స్పందించే శింబు కూడా పెదవి విప్పకపోవడం గమనార్హం.

English summary
South star Arya mentioned that it is the age of fake pictures and videos and requested that people don't believe what they see. He was referring to the Suchitra Karhtik incident.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu