»   » ధనుష్ దాడి చేశాడు.. సెక్స్ కుంభకోణం.. గాయని ఆరోపణలు

ధనుష్ దాడి చేశాడు.. సెక్స్ కుంభకోణం.. గాయని ఆరోపణలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సూపర్ స్టార్లు ధనుష్, శింబుపై గాయని, నటి సుచిత్ర తీవ్రమైన ఆరోపణలు చేసింది. నటుడు ధనుష్ తనపై దాడికి పాల్పడ్డారని ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా సద్గురు జగ్గి వాసుదేవ్‌పై కూడా విమర్శలు మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే ఇంతటి తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె మీడియా ముందుకు రాకపోవడంతో సుచిత్ర ప్రవర్తనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హీరో ధనుష్ దాడి చేశాడు.

ధనుష్‌తోపాటు ఆయన సిబ్బంది కూడా దాడి చేశారు. నా పట్ల దారుణంగా ప్రవర్తించారు. నా చేతులపై గాయాలయ్యాయి. అందుకు సాక్షం ఇదిగో అంటూ ఫొటోలను ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవన్‌పై అభ్యంతకరమైన ట్వీట్ చేసింది.

కోయంబత్తూర్‌లో సెక్స్ కుంభకోణం

భారీ సెక్స్ కుంభకోణం జరుగుతున్నది. కోయంబత్తూరులో జరిగింది ఇదే అని సుచిత్ర ట్వీట్ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సుచిత్ర మీడియాతో మాట్లాడటానికి ప్రయత్నించగా ఆమె మీడియాకు అందుబాటులోకి రాకపోవడం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గాయనిగా సుపరిచితులు..

తమిళ చిత్ర పరిశ్రమలో సుచిత్ర గాయనిగా సుపరిచితులు. ఆమె పాడిన పాటలు సంగీత అభిమానులను ఉర్రూతలూగించాయి. గతేడాది తమిళ కమెడియన్ కార్తీక్ కుమార్‌ను వివాహాం చేసుకున్నది.

ట్విట్టర్ హ్యాక్ అయింది.

ఆమె ట్వీట్స్ అత్యంత వివాదంగా మారిన నేపథ్యంలో తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని తెలుపడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత జరిగిన ఆమె మీడియాకు దూరంగా ఉంటూనే పలు విషయాలపై లీకులు ఇస్తున్నది. ట్విట్టర్‌లో సుచిత్ర చేసిన కొన్ని ట్వీట్స్ ఇవే..

Read more about: dhanush ధనుష్
English summary
From past few days singer Suchitra posting some controversial tweets and criticizing Actor Dhanush and Simb. Even she claimed that Dhanush attacked her. Suchitra took potshots at Dhanush and Sadguru Jaggi Vasudev, head of Isha Foundation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu