twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుద్దాల అశోక్‌తేజకు కొమురం భీమ్ జాతీయ అవార్డు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ కొమురం భీమ్ జాతీయ పురస్కారం అందుకున్నారు. భారత్ కల్చరల్ అకాడమీ, కొమురం భీమ్ స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసీ సంస్కతి పరిరక్షణ సమితి, ఓం సాయి తేజా ఆర్ట్స్ సంయుక్త నిర్వహణలో ఈ అవార్డునును బహుకరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

    జాతి విముక్తి కోసం ప్రాణాలర్పించిన కొమురం భీమ్ ఆదర్శ జీవి అని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. సినీ మాధ్యమం ద్వారా ఆ పోరాట యోధుడి చరిత్ర దేశ వ్యాప్తంగా ప్రజలకు చేరువవుతోందని అన్నారు. తెలుగు సినీ రచయితల అధ్యక్షుడు పరుచూరి గోపాల కష్ణ మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ కోసం ఆది నుంచి పోరాటాలు జరుగుతున్నాయని, కొమురం భీమ్ జీవితం పోరాటానికి ప్రతిరూపమని అన్నారు. సుద్దాల అశోక్‌తేజకు అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేసారు.

    అవార్డు గ్రహీత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ గీత రచయితగా 20ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో జాతీయ అవార్డుతో పాటు మరెన్నో పురస్కారాల్ని పొందానని, కొమురం భీమ్ అవార్డును పొందడం సమున్నత గౌరవంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. అవార్డుపేరిట తనకు అందజేసిన చెక్‌ను ఆదివాసి పోరాటానికి అంకితమైన వారికి అందిస్తున్నానని ప్రకటించారు.

    స్లైడ్ షోలో ఫోటోలు...

    సన్మానం

    సన్మానం

    సుద్దాల అశోక్ తేజ దంపతులను సన్మానిస్తున్న దృశ్యం.

    అవార్డు

    అవార్డు

    భారత్ కల్చరల్ అకాడమీ, కొమురం భీమ్ స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసీ సంస్కతి పరిరక్షణ సమితి, ఓం సాయి తేజా ఆర్ట్స్ సంయుక్త నిర్వహణలో ఈ అవార్డునును బహుకరించారు.

    బాబు మోహన్

    బాబు మోహన్

    ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి నటుడు, ఎమ్మెల్యే బాబు మోహన్.

    పోరాటానికి అంకితమైన వారికి

    పోరాటానికి అంకితమైన వారికి

    అవార్డుపేరిట తనకు అందజేసిన చెక్‌ను ఆదివాసి పోరాటానికి అంకితమైన వారికి అందిస్తున్నట్లు అశోక్ తేజ ప్రకటించారు.

    English summary
    Suddala ashok teja Gets Komaram Bheem National Award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X