For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కసెక్కించే ఆంటీలు..కాసులు రాల్చే చిత్రాలు(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: రొమాంటిక్ క్రైమ్ కథ,ఈ రోజుల్లో,బస్ స్టాప్ చిత్రాలు హిట్ కావటంతో చిన్న చిత్రాలకు ముఖ్యంగా బూతుని బ్రహ్మాండంగా చూపే చిత్రాలకు డిమాండ్ మొదలైంది. ఈ కోవలో వరసలో చిత్రాలు వచ్చి పడుతున్నాయి. తక్కువ బడ్జెట్ లో చుట్టేయటం, ఓ వర్గాన్ని ఆకర్షించటం ఈ చిత్రాల లక్ష్యం. ఈ కోవలో 'కౌసల్య ఆంటీ', ఓ ఆంటీ కథ, అనాగరికం 2, ఈ రోజుల్లో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, వంటి అనేక చిత్రాలు రెడీ అవుతున్నాయి.

  పోస్టర్స్, ఫోటోలు సెక్సీగా వదలటంతోనే ఈ చిత్రాల పబ్లిసిటీ మొదలవుతోంది.. ఎక్కడెక్కడ వాళ్లు ఈ తరహా సాప్ట్ ఫోర్న్ చిత్రాల వల్ల లాభాలు ఖాయం అనే నమ్మకంగా రెడీ అవుతున్నారు. ఈ ట్రెండ్ ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న ఈ తరహా తెలుగు చిత్రాలును పరిశీల్దదాం...

  ఒక రొమాంటిక్ క్రైమ్ కథ,బస్ స్టాప్ చిత్రాలు హిట్ అవటం ఈ తరహా ట్రెండ్ కు కారణమైందని సినీ పెద్దలు అంటున్నారు.

  వహీద, ప్రత్యూష కీలక పాత్రధారులుగా వస్తున్న చిత్రం 'కౌసల్య ఆంటీ'. కాలేజీలో చదువుకునే ఓ అమ్మాయిని ఐదుగురు విద్యార్థులు అత్యాచారం చేసి హత్యచేస్తారు. ఆ అమ్మాయి అక్క కౌసల్య వాళ్ళపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది. తన అందంతో వారిని బంధించి ఎలా హతమార్చింది? అనేది ఆసక్తికరం అని కథ చెప్తున్నారు.

  సోనీ, శిరీష ప్రధాన పాత్రలో నిర్మించిన చిత్రం ‘ఓ ఆంటీ కథ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్‌ మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘అక్రమ సంబంధం ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది అనే అంశంతో తెరకెక్కించిన చిత్రమిది అని ఈ చిత్రం కథ చెప్తున్నారు.

  వహీదా ప్రధాన పాత్ర పోషించిన మరో చిత్రం 'అనాగరికం-2'. "పదో తరగతి చదువుతున్న రాధ అనే పేదపిల్ల కథ ఇది. ఓ ట్యూషన్ మాస్టర్ కామవాంఛకు బలై, అతని వేధింపులకు గురవుతున్న ఆమె ఏం చేసిందనేది ఈ చిత్ర కథాంశం.


  నూతన తారలు కిరణ్‌కుమార్, లిజా జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ రోజుల్లో రొమాంటిక్ క్రైమ్ స్టోరి'. "ఈ రోజుల్లో కండోమ్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయంటే వాటికి ఎంతవరకు మంచికీ, ఏ స్థాయిలో చెడుకీ వినియోగిస్తున్నారో అర్థంకాని స్థితి ఉంది. తాత్కాలిక ఆకర్షణలకు లోనై తాము ఏం చేస్తున్నారో తెలీని మత్తులో యువత జోగుతున్నారు. అలాంటి వారికి మా చిత్రం కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది '' అని నిర్మాత సంతోష్ తెలిపారు.

  ఈ సినిమాలు చాలవన్నట్లు కన్నడలో మంచి విజయం సాధించిన ‘దండు పాళ్యం' చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు.అతి క్రూరమైన దండుపాళ్యం గ్యాంగ్ కథ ఇది. గొంతు కోసే సమయంలో వచ్చే శబ్దం కోసం ఒకతను 80 మందిని మర్డర్ చేస్తాడు. దండుపాళ్యం గ్యాంగ్ గురించి ఓ జర్నలిస్టు రాసిన ఆర్టికల్ ఈ చిత్రానికి బేస్ అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

  English summary
  After the success of small budget films like Ee Rojullo,Bus Stop and Oka Romantic Crime Katha, there is a sudden enthusiasm among small budget filmmakers to jump on the bandwagon of making films.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X