'ఈగ'లో ఆఫర్ ఎలా వచ్చిందంటే...: సుదీప్
రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' విడుదల అయ్యాక తెలుగులో సుదీప్ తెలియని వారు లేరు. ఈ నేఫద్యంలో ఆయన ఈ 'ఈగ'ప్రాజెక్టులోకి వచ్చారో మీడియాకు తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ...హిందీలో 'రణ్', 'ఫూంక్', 'రక్తచరిత్ర' చిత్రాలు చేశాను. అందులో రాజమౌళి 'రణ్' చూశారు. నా నటన ఆయనకు గుర్తుండిపోయిందట. ఒక రోజు నాకు ఫోన్ చేసి 'ఈగ' కథాంశాన్ని చెప్పారు. అందులో నా పాత్రను వివరించి చేయమన్నారు. నన్ను ఆయన ఎంపిక చేసుకోవడానికి రణ్ చిత్రమే కారణం అని చెప్పారు.
ఇక కన్నడంలో హీరోగా చేసే ఆయన 'ఈగ'లో విలన్ పాత్ర ఒప్పుకోవటానికి కారణం చెపుతూ..ఒక కళాకారుడు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఒక పాత్రకు పరిమితి అయి హద్దులు ఏర్పరచుకోకూడదు. 'ఈగ'లో అందరూ నాది విలన్ పాత్ర అంటున్నారు. కానీ హీరోని చంపేవాడే అయినా ఎక్కడా క్రూరత్వం ఉండదు. చాలా స్త్టెలిష్‌గా, హుందాగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ పాత్ర ప్రయాణమే విచిత్రంగా సాగుతుంది. నాయికపై మోహం పెంచుకొంటాడు... కానీ ఎక్కడా అసభ్యంగా ఉండదు.
అలాగే 'ఈగ' పెట్టే చిరాకు మూలంగా హాస్యం పండించినా ఎక్కడా బఫూన్‌లా కనిపించడు. కాబట్టే నేను అంగీకరించాను. రజనీకాంత్, నాగార్జున, రవితేజ, సూర్య, ప్రభాస్ లాంటి ప్రముఖ నటులు ఫోన్‌లు చేసి అభినందనలు కురిపించడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. ఇక రాజమౌళి చెప్పిన మాటలే నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చాయి. అవేమిటంటే ఆయన మాట్లాడుతూ ''నాకు వయసైపోయాక ఎప్పుడైనా పాత జ్ఞాపకాలలోకెళితే సుదీప్‌లాంటి నటుడితో ఒక సినిమా చేశాను అనేది ఒక తీపి గుర్తుగా ఉండిపోతుంది'' అన్నారు. నాకు ఆ మాట వెయ్యి అవార్డులతో సమానం అని చెప్పారు. ప్రస్తుతానికి తెలుగులో ఏ చిత్రమూ కమిట్ కాలేదని చెప్పారు. తన చిత్రాలు డబ్బింగ్ అవుతున్న విషయం తనకు తెలియదని చెప్పారు.


Click it and Unblock the Notifications











