సుదీప్ దర్శకత్వంలో రవితేజ కన్నడ రీమేక్

By Bojja Kumar

కన్నడలో ఇటీవల విడుదలై సూపర్ హిట్టయిన 'విష్ణువర్ధన' అనే సినిమాను తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులోనూ ఈ చిత్రానికి సుదీప్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై సుదీప్ రవితేజతో మాట్లాడాడని, రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కన్నడ సినీవర్గాల సమాచారం. ధీర రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.

సుదీప్, భావన, ప్రిమయణి ప్రధాన తారాగణంగా రూపొందిన 'విష్ణువర్ధన' సినిమా వారం రోజుల్లోనే కర్నాటకలో రూ. 6 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగులో రవితేజ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో ఈ సినిమా తీస్తే కలెక్షన్ల వరద పారడం ఖాయం అని ఆలోచనలో ఉన్నారు దర్శక, నిర్మాతలు.

ప్రస్తుతం రవితేజ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నిప్పు' చిత్రంలో బిజీగా గడుపుతున్నాడు. రవితేజ సరసన దీక్షా సేథ్ నటిస్తోంది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X