సుదీపే నా హీరో: సమంత
'ఈగ' చిత్రం సక్సెస్‌తో మంచి జోరు మీద ఉన్న సమంత ఇప్పుడు కన్నడ నటుడు సుదీప్ జపం అందుకుంది. ఈగ చిత్రంలో అతని నటనకు ఫిదా అయిపోయిన ఈభామ అతన్ని పొగడ్తలతో ఆకాశానికెత్తేస్తుంది. ట్విట్టర్లో సమంత ఈ విషయమై స్పందిస్తూ....'నాని, సుదీప్ అద్భుతంగా నటించారు. నాని చాలా లవ్లీగా చేశాడు. సుదీప్ పెర్ఫార్మెన్స్ గురించి మాటల్లో చెప్పలేక పోతున్నా. రాజమౌళికి మరియు ఈగ టీంకు థ్యాంక్స్' అంటూ ట్వీట్ చేసింది.
సుదీప్‌ను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్న నేపథ్యంలో మరొక ట్వీట్ చేసిన సమంత..'సుదీప్ నేవ్వే నా హీరో...నిన్ను అంతా ప్రశంసిస్తున్నారు. నువ్వు అందుకు అర్హుడివి. నీ పెర్ఫార్మెన్స్ సూపర్' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఈగ చిత్రం విజయంతో సమంత మరోసారి లక్కీ హీరోయిన్ అని నిరూపించుకుంది.
సమంత ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నీ హిట్ చిత్రాలుగానే నిలిచాయి. దీంతో పరిశ్రమలో సమంత అంటే ఓ లక్కీ సింబల్ అయిపోయింది. తమ సినిమా హిట్ కావాలనే సెంటిమెంటుతోనే చాలా మంది దర్శకులు, నిర్మాతలు ఆమెను ప్రిఫర్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం సమంత నాగచైతన్యతో కలిసి 'ఆటోనగర్ సూర్య', నానితో కలిసి 'ఎటో వెళ్లి పోయింది మనసు', సిద్ధార్థతో కలిసి నందినరెడ్డి దర్శకత్వంలో మరో చిత్రం చేస్తుంది. త్వరలో బెల్లకొండ సురేష్ తన కుమారుడు సాయిని హీరోగా పరిచయం చేసే చిత్రంలో కూడా సమంతను హీరోయిన్‌గా బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











