అల్లరి నరేష్,సుదీప్ కాంబినేషన్ లో...
చెన్నై: 'ఈగ' చిత్రం హిట్ కావటంతో కన్నడ హీరో సుదీప్ కు తెలుగు,తమిళ భాషల్లో మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా అల్లరి నరేష్ హీరోగా దూకుడు నిర్మాత డైరక్టర్ గా మారి చేస్తున్న యాక్షన్ చిత్రంలో సుదీప్ ని తీసుకున్నారు. ఈ విషయాన్ని అనీల్ సుంకర ట్విట్టర్ లో ఖరారు చేసారు. ఆ ట్వీట్ లో ..."సుదీప్ మా యాక్షన్ షూట్ లో ఈ రోజు నుంచి జాయిన్ అయ్యారు. అలాంటి సూపర్బ్ యాక్టర్ తో పనిచేయటం అద్బుతంగా ఉంది. సూపర్ పీలింగ్," అని చేసారు.
అల్లరి నరేష్, వైభవ్, రాజసుందరం, కిక్‌శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు అనిల్ సుంకర మాట్లాడుతూ, 'ఓ చక్కటి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. చిత్రం బాగా వస్తున్నదంటే అందుకు నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల సహకారం ఎంతగానో ఉంది. సర్వేష్ మురారి ఛాయాగ్రహణం కనువిందు చేస్తుంది. త్వరలో బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్, గోవాలో ఓ షెడ్యూల్ చేస్తాం' అని చెప్పారు.
ఇక సుదీప్ విషయానికి వస్తే.. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా చేయనున్న యోహాన్ అధ్యాయం ఒండ్రు చిత్రంలో హీరోగా ఎంపిక చేసారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో త్వరలో షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో ఇళయదళపతి విజయ్ సరసన పొడుగు కాళ్ల సుందరి సమీరారెడ్డి నటించనున్నట్లు సమాచారం.
మరో ప్రక్క ఈగతో వచ్చి క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి డబ్బింగై దిగుతున్నాయి. కన్నడ దర్శకుడు గురుదత్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం 'కిచ్చ ఖుచ్చా'చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసి వదులుతున్నారు. 'ఈగ' ఫేమ్ సుదీప్ హీరోగా గురుదత్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం 'కిచ్చ ఖుచ్చా'. ఈ సినిమా 'కిచ్చా' పేరుతో తెలుగులో విడుదల కానుంది. 'పక్కా మాస్' అనేది ట్యాగ్ లైన్. అరిగెల కిషోర్ ఈ అనువాద చిత్రానికి నిర్మాత.


Click it and Unblock the Notifications











