యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుదీప్ ‘రౌడీ సింహా’

By Bojja Kumar

హైదరాబాద్: 'ఈగ' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుదీప్ హీరోగా, సలోని హీరోయిన్‌గా రూపొందిన కన్నడ చిత్రం తెలుగులో 'రౌడీ సింహా'గా రాబోతోంది. నిర్మాత ఎస్.జి.ఆర్ ప్రసాద్ తెలుగులో ఈచిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. లక్ష్మీ లోటస్ మూవీ మేకర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సాధు కోకిల దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తొలి కాపీతో విడుదలకు సిద్దం అవుతోంది.

ఈ చిత్రం గురించి నిర్మాత ఎస్.జి.ఆర్ ప్రసాద్ వివరిస్తూ 'కన్నడంలో రూపుదిద్దుకుని విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసాం. సక్సెస్ ఫుల్ దర్శకుడు రాజమౌళి దర్వకత్వంలో వచ్చిన ఈగ చిత్రంలో నటించిన సుదీప్, మర్యాదరామన్న సినిమాలో నటించిన సలోని ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించడం విశేషం. అన్యాయం ఎక్కడ జరిగినా ప్రతిఘటించి, పోరాటా చేసే యువకుడి పాత్రను సుదీప్ పోషించారు. సలోని జర్నలిస్టు‌ పాత్ర పోషించారని వెల్లడించారు.

ఆసక్తికరమైన సంఘటనలతో, భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సినిమాలోని మూడు పాటలను సింగపూర్, మలేషియా, బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం చాలా రిచ్‌గా ఉంటుంది. ఈ నెల్లోనే ఆడియోను, అక్టోబర్లో సినిమాను విడుదల చేస్తాం, తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది'అని తెలిపారు.

సుదీప్, సలోని, గీత, అవినాష్, అనంతనాగ్ తదితరులు నటించిన ఈచిత్రానికి మాటలు, పాటలు: వల్లూరి వెంకట్, సంగీతం: గురు కిరణ్, ఎడిటింగ్: సుబ్రహ్మణ్యం, ప్రొడక్షన్: సుధాకర్, నిర్మాత: ఎస్.జి.ఆర్. ప్రసాద్, దర్వకత్వం: సాధు కోకిల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X