పవన్ మ్యాజిక్...కన్నడంలో నిన్నే మొదలైంది
బెంగళూరు : తెలుగులో హిట్టైన చిత్రాల రీమేక్ లు వరసగా చేస్తున్న కన్నడ హీరో సుదీప్. తెలుగు వారికి ఈగ చిత్రంతో పరిచయమైన సుదీప్ ... రీసెంట్ గా మిర్చి రీమేక్ తో సూపర్ హిట్ కొట్టారు. అదే ఉత్సాహంలో తెలుగులో ఘనవిజయం సాధించిన 'అత్తారింటికి దారేది' రీమేక్ కు పూనుకున్నారు. ఈ కన్నడ రీమేక్ చిత్రీకరణ నగరంలో ఆరంభమైంది.
బెంగళూరులోని రాజాజీనగరలోని వినాయకుడి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున ముహూర్తం సన్నివేశాన్ని చిత్రీకరించారు. హైదరాబాదులో చిత్రీకరణకు యూనిట్ వెళ్లనుంది. అక్కడ రెండు వారాల పాటు కొనసాగిస్తారు.

అనంతరం బెంగళూరు, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ కొనసాగుతుందని హీరో సుదీప్ తెలిపారు. ఇందులో సుదీప్‌కు జంటగా రచితారాం, హరిప్రియ నటిస్తారు. తెలుగులో నదియా పోషించిన పాత్రకు మధుబాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
తెలుగులో వందకోట్లు సాధించిన చిత్రంగా 'అత్తారింటికి దారేది' రికార్డు క్రియేట్ చేసింది. కన్నడంలోనూ అదే హవా కొనసాగిస్తుందని అప్పుడే ట్రేడ్ వర్గాల్లో హడావిడి మొదలైంది. అక్కడ మీడియాసైతం ఈ చిత్రం ప్రారంభంపై ఉత్సాహం చూపిస్తూ బులిటెన్స్ ప్రసారం చేసింది.


Click it and Unblock the Notifications











