తెలుగులో వంద థియేటర్లలో సుదీప్ చిత్రం రిలీజ్
'ఈగ' ఫేమ్ సుదీప్ కథానాయకుడిగా గురుదత్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం 'కిచ్చ ఖుచ్చా'. ఈ సినిమా 'కిచ్చా' పేరుతో తెలుగులో విడుదల కానుంది. 'పక్కా మాస్' అనేది ఉపశీర్షిక. అరిగెల కిషోర్ ఈ అనువాద చిత్రానికి నిర్మాత. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -'''ఈగ' చిత్రంలోని తన నటనతో తెలుగు ప్రేక్షకులను రంజింపజేసిన సుదీప్, 'కిచ్చా'తో మరోసారి తెలుగులో తన సత్తా చాటనున్నారు. కన్నడంలో సంచలన విజయం సాధించిన సినిమా ఇది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు గురుదత్‌ని ఈ సినిమా మలిచారు. కథానాయిక రమ్య అందచందాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అని తెలిపారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..'సుదీప్ తొలి సినిమా తెలుగులో వచ్చింది. స్పర్శద్వారా పరిచయమైనా అది ఆడలేదు. 'ఈగ'తో ఒక్కసారిగా అందరికీ తెలిశాడు. తెలుగులో సినిమా చేయాలనే ఆయన కోరిక ఈ చిత్రంతో నెరవేరుతుంది' అని అన్నారు. రమ్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: వి.హరికృష్ణ, కెమెరా: శ్రీవెంకట్, సమర్పణ: అరిగెల ఉజ్వల గోపీచంద్.


Click it and Unblock the Notifications












