‘ఈగ’ఫేమ్ సుదీప్ హీరోగా తెలుగు చిత్రం
'ఈగ'లో విలన్ గా చేసిన సుదీప్ ఇప్పుడు తెలుగునాట కూడా పాపులర్ అయ్యాడు. దాంతో ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి డబ్బింగై దిగుతున్నాయి. కన్నడ దర్శకుడు గురుదత్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం 'కిచ్చ ఖుచ్చా'చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసి వదులుతున్నారు.
'ఈగ' ఫేమ్ సుదీప్ హీరోగా గురుదత్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం 'కిచ్చ ఖుచ్చా'. ఈ సినిమా 'కిచ్చా' పేరుతో తెలుగులో విడుదల కానుంది. 'పక్కా మాస్' అనేది ట్యాగ్ లైన్. అరిగెల కిషోర్ ఈ అనువాద చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెల మూడో వారంలో పాటలను, ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేస్తాం
ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -'''ఈగ' చిత్రంలోని తన నటనతో తెలుగు ప్రేక్షకులను రంజింపజేసిన సుదీప్, 'కిచ్చా'తో మరోసారి తెలుగులో తన సత్తా చాటనున్నారు. కన్నడంలో సంచలన విజయం సాధించిన సినిమా ఇది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు గురుదత్‌ని ఈ సినిమా మలిచారు. హీరోయిన్ రమ్య అందచందాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అని తెలిపారు.
ఇక తెలుగులో రాజుభాయ్ అని వచ్చిన చిత్రానికి ఇది కన్నడ రూపం. మంచు మనోజ్ తెలుగులో నటించారు. ఇక్కడ ఆ సినిమా ఆడలేదు. అలాగే ఈ చిత్రం తమిళ చిత్రం మౌనం పేసిదే కు రీమేక్ కావటం విశేషం. ఇక ఈ చిత్రానికి సంగీతం: వి.హరికృష్ణ, కెమెరా: శ్రీవెంకట్, సమర్పణ: అరిగెల ఉజ్వల గోపీచంద్.


Click it and Unblock the Notifications











