క్రేజ్ తెచ్చాడు :చిన్న సినిమాకు పెద్ద హీరో పాట
బెంగళూరు : ఇప్పుడు హీరోలు,హీరోయిన్స్ పాట పాడి ప్రాజెక్టుకు క్రేజ్ తేవటం కామన్ అయ్యింది. అదే రూటులో కన్నడ హీరో, తెలుగు విలన్ సుదీప్ పాట పాడారు. అయితే ఆయన పాడింది....తన చిత్రం కోసం కాదు. అదీ రెమ్యునేషన్ లేకుండా వేరే వారి చిత్రానికి పాడారు. దాంతో ఆ చిన్న చిత్రం కు క్రేజ్ వచ్చింది. అందరూ సుదీప్ ని మెచ్చుకుంటున్నారు.

దర్శక నిర్మాత సహా మహిళా సాంకేతిక నిపుణులు రూపొందిస్తున్న ''రింగ్‌రోడ్డు శుభ'' సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. నగరంలోని కోరమంగళ ప్రాంతంలో చోటుచేసుకున్న యదార్థ సంఘటన నేపథ్యంలో దీన్ని రూపొందిస్తున్నారు.
వివిధ ప్రాంతాల్లో మహిళలపై దౌర్జన్య సంఘటనల్ని కూడా ఇందులో ప్రస్తావించనున్నట్లు తెలిసింది. ఇటీవలే ఈ సినిమా కోసం ప్రముఖ నటుడు సుదీప్ పాట పాడారు. మహిళల సాహసాన్ని మెచ్చుకుని తాను పారితోషికం తీసుకోకుండా పాల్గొన్నట్లు సుదీప్ తెలిపారు. ఇందులో విజయ్, నిఖితా తదితరులు ప్రధాన తారాగణం.


Click it and Unblock the Notifications











