ప్రభాస్-సుదీప్ మధ్య శతృత్వానికి రాజమౌళి ప్లాన్!
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఈగ మూవీ స్టార్ సుదీప్ మధ్య శతృత్వానికి దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడా? ఇద్దరిని ప్రత్యర్థులుగా మార్చ బోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సినీ వర్గాల్లో. కొంపతీసి ఇది రియల్ లైఫ్‌లో అనుకునేరు...మేం చెబుతున్నది రీల్ లైఫ్‌లో జరుగబోయే దాని గురించి.
ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం ప్రభాస్ సరసన పరవ్ ఫుల్ విలన్ కోసం అన్వేషించిన రాజమౌళి చివరకు సుదీప్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా చాలా మందిని పరిశీలించినప్పటికీ ప్రభాస్ క్యారెక్టర్ కు తగిన సవాల్ విసిరే మేనరిజం ఒక సుదీప్‌లో మాత్రమే ఉందని రాజమౌళి డిసైడ్ అయినట్లు చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం ఈచిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్కా మీడియా బేనర్‌పై నిర్మాత దేవినేని ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు.
'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











