షాక్ : సుధా ఆంటీ రెచ్చిపోయి డాన్స్ లు
హైదరాబాద్ : హోమ్లీ క్యారెక్టర్స్ వేసే సుధా ని ఇలా డాన్స్ తో చూడటం అందరికి ఆశ్చర్యమే. హీరో,హీరోయిన్స్ కు అమ్మగా కనిపించే ఆమె ఇలా ఎన్నారైలను అలరించటానికి మసాలాను గుమ్మరించింది. తణికెళ్ల భరిణి, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్ వంటి వారకి భార్యగా కనిపించే ఆమె ఇప్పుడు పెద్దగా ఆఫర్స్ లేక ఖాళీగా ఉంటోంది.
రీసెంట్ గా అమెరికా న్యూజెర్సీలోని తెలుగువారు ఏర్పాటు చేసిన ఆట పోగ్రాంకి హాజరయ్యింది. అక్కడ పోగ్రామ్ లో భాగంగా ఆమె స్టేజి ఎక్కి అందరినీ ఆశ్చర్యపోయేలా హాట్ హాట్ స్టెప్ లతో అదరకొట్టింది. రేసు గుర్రంలో హిట్టయిన సినిమా చూపిస్తా మామ పాటకు ఆమె వేసిన స్టెప్ లు ఓ టీవీ ఛానెల్ లో వచ్చి ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

సుధ స్టెప్ లు చూసిన సినిమా వారు సైతం షాక్ అవుతున్నారు. ఇన్ని రోజులు ఆమె అక్క, అమ్మపాత్రలకే పరిమితం చేసామని భాధపడుతున్నారు. అయితే ఏదో ఒకసారి స్టేజిపై సరదాగా అలా ఆడినంత మాత్రాన తెరపై అలాంటి వేషాలు ఎందుకు వేస్తారామె. వేసినా జనం ఎందుకు చూస్తారు.


Click it and Unblock the Notifications











