గందరగోళంగా నితిన్ దుబాయ్ పెళ్లి.. డెస్టినేషన్ వెడ్డింగ్‌పై యువ హీరో తండ్రి క్లారిటీ
కరోనావైరస్ యువ హీరో నితిన్‌కు చాలానే కష్టాలు తెచ్చిపెడుతుంది. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ కుర్ర హీరో తన పెళ్లిని దుబాయ్‌లో జరుపుకోవాలని నిర్ణయించుకొన్నాడు. అంతా సవ్యంగా జరుగుతుందనే సమయంలో కరోనావైరస్ విజృంభించడంతో పరిస్థితి తారుమారైంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే దుబాయ్‌లో చేసిన అడ్వాన్సు బుకింగ్స్ గందరగోళంగా మారాయి. తన కుమారుడు నితిన్ పెళ్లిపై నిర్మాత సుధాకర్ రెడ్డి స్పందిస్తూ..

తలకిందులవుతున్న పెళ్లి ప్లాన్స్
నితిన్, షాలిని వివాహానికి దుబాయ్‌లో ఏర్పాట్లు చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఏప్రిల్ 15వ తేదీన పెళ్లి కార్యక్రమాలు, అలాగే ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్ నిర్వహించాలని అనుకొన్నారు. అందుకు దాదాపు 100 మంది వరకు గెస్టులను ఆహ్వానించారు. కానీ కరోనా వైరస్ దెబ్బకు ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. అయితే దుబాయ్‌లో ఈ పెళ్లి జరిగేది లేదనే విషయంపై ఇంకా క్లారిటీ రాకపోవడం గమనార్హం.

అదే రోజు పెళ్లి జరిపించాలనుకొంటే
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపించి ఉండటంతో నితిన్ పెళ్లి గురించి తర్జనభర్జనలు పడుతున్నాం. ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అదే రోజు పెళ్లి జరిపించాలని అనుకొంటే.. దుబాయ్ కాకుండా వేరే చోట పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. వేదిక మార్పు గురించి కూడా ఆలోచిస్తున్నాం. పలు రకాల ఆప్షన్ల కోసం ఆలోచిస్తున్నాం అని నిర్మాత సుధాకర్ రెడ్డి మీడియాతో అన్నారు.

వాయిదా వేస్తే గెస్టులకు కష్టాలు
నితిన్, షాలిని వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముందుగానే గెస్ట్ లిస్టు లాక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ చేస్తే వందమందికి పైగా అతిథుల ట్రావెల్ ప్లాన్స్ బెడిసికొడుతాయి. అడ్వాన్సుగా బుకింగ్ చేసుకొన్న టికెట్లు, ఇతర విషయాల్లో చాలా నష్టం కలుగుతుంది. అదే విషయం మాకు ఆందోళన కలిగిస్తున్నది. ఇంకా సమయం ఉన్నందున్న పరిస్థితిలో సానుకూలత ఏర్పడుతుందనే భావనలో ఉన్నాం అని సుధాకర్ రెడ్డి తెలిపారు.
Recommended Video

నితిన్ పెళ్లిపై సోదరి నికితా రియాక్షన్
తన సోదరుడు నితిన్ పెళ్లిపై నికితా రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. పెళ్లి డెస్టినేషన్ మ్యారేజ్‌గా నిర్వహించాలా? లేక వాయిదా వేయాలా? అనే విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదు. పెళ్లి వాయిదా వేయాలా? లేక తేదీలు మార్చాలా? వెడ్డింగ్ ప్లేస్ మార్చాలా అనే ఆప్షన్లు మా ముందు ఉన్నాయి. వాటిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. పరిస్థితిని వేచి చూసే ధోరణితో ఉన్నాం. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకొంటాం అని నికితారెడ్డి అన్నారు.


Click it and Unblock the Notifications











