మామగారి టైటిల్...మహేష్ బాబు క్యారక్టరైజేషన్

By Srikanya

హైదరాబాద్: పోకిరిలో మహేష్‌బాబు తరహాలో నా పాత్ర పవర్‌ఫుల్‌గా వుంటుంది. ఎక్కడా అతిశయాలు లేకుండా ప్రతి సన్నివేశం సహజంగా వుంటుంది. స్టైలిష్ మాస్ క్యారెక్టర్ చేయాలంటే ఏ నటుడికైనా చాలా ధైర్యం కావాలి. భావించి ఈ సినిమా చేశాను అంటున్నారు సుధీర్ బాబు. ఆయన తాజా చిత్రం మోసగాళ్లకు మోసగాడు చిత్రం రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఈ చిత్రం టైటిల్ ..సుధీర్ బాబు మామగారు అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి..సూపర్ హిట్ చిత్రందే అనే సంగతి తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహేష్‌బాబు సలహాలు గురించి మాట్లాతూ... ప్రతి సినిమా కథని ఆయనతో కలిసి చర్చిస్తాను. దర్శకులు, టెక్నీషియన్స్ గురించి మహేష్ అడిగి తెలుసుకుంటారు. కథాపరంగా ఏమైనా అవసరమనిపిస్తే సలహాలిస్తారు. అయితే సినిమా చేయాలా?వద్దా? అనే విషయంలో అంతిమ నిర్ణయం మాత్రం నాదే అన్నారు.

టైటిల్ గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ.... తెలుగు సినిమాలో కొత్త ట్రెండ్‌కు నాంది పలికిని గొప్ప చిత్రం మోసగాళ్లకు మోసగాడు. ఆ రోజుల్లోనే వందదేశాల్లో ఆడి రికార్డు సృష్టించింది. అయితే ఈతరం వారికి ఆ సినిమా ఘనత ఏమిటో తెలియదు. ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. ఈ సినిమాలో నా గెటప్ చాలా బాగుందని మావయ్య మెచ్చుకున్నారు. రెండు సినిమాల టైటిల్ డిజైన్ ఒకటేనని గుర్తుచేశారు అన్నారు.

Sudheer Babu about his Character in Mosagallaku Mosagaadu

చిత్రం కథ గురించి మాట్లాడుతూ.... జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా చిన్న చిన్న మోసాలు చేసి బ్రతికే చలాకీ యువకుడి పాత్రలో కనిపిస్తాను. అనుకోకుండా వచ్చిన ఓ సమస్య నుంచి బయటపడటానికి అతనికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. దాని కోసం అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. ఇదొక కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్. నా పాత్రలో పక్కా మాస్‌గా అనిపించినా ైస్టెలిష్‌గా వుంటుంది. హాలీవుడ్ సినిమాల మాదిరిగా డైలాగ్స్ తక్కువగా వుంటాయి అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... ‘తన తెలివితేటలతో ఎదుటి వారిని మోసం చేస్తూ సరదాగా జీవితాన్ని గడిపే యువకుడు క్రిష్. ఎలాంటి గోల్ లేని అతడి జీవితంలోకి అనుకోకుండా ఓ పెద్ద లక్ష్యం వచ్చి చేరుతుంది. అదేమిటి? 12 శతాబ్దానికి చెందిన సీతారాముల విగ్రహాలతో అతనికి ఉన్న సంబంధమేమిటి? అన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదిని అలరిస్తుందనే నమ్మకముంది' అని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ ‘కథ,కథనాలు వినూత్న తరహాలో సాగుతాయి. మణికాంత్ ఖాద్రి అందించిన స్వరాలకు శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రేమ, వినోదం, యాక్షన్, ఎమోషన్స్ సమపాళ్లలో మేళవించి దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకముంది' అని అన్నారు.

ఎస్‌ఎంఎస్ చిత్రం ద్వారా హీరోగా అరంగేట్రం చేసిన సుధీర్ బాబు... ప్రేమకథా చిత్రమ్ ఆడు మగాడ్రా బుజ్జీ చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఈ నెల 22న ప్రేక్షకులముందుకురానుంది. అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహణ్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్ ఖాద్రి, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: ప్రసాద్‌వర్మ పెన్మత్స, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, పాటలు: శ్రీమణి, కె.కె, సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వేగేశ్న.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X