సరైన ఫుడ్ దొరకదని మహేష్ బాబు
ఈ రంగంలోకి వస్తే... సమయానికి సరైన ఫుడ్ దొరకదు. పబ్లిక్‌లో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. టైమ్‌కు నిద్ర ఉండదని.. పలు రకాల సూచనలు మహేష్ బాబు చేశారని సుధీర్ బాబు అన్నారు. సూపర్‌గుడ్ ఫిలింస్ బ్యానర్‌లో 'శివ మనసులో శృతి' (ఎస్‌ఎంఎస్) అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఈ చిత్రంలో తాను కొరియర్ బాయ్ గా నటించాననీ, కొరియర్ బాయ్ లు ఎలా ఉంటారో తగు శిక్షణ తీసుకుని ఒకరకమైన యాసతో ఈ చిత్రంలో కన్పించనున్నట్లు తెలిపారు. ఇక తాను 'ఏమాయ చేసావె'లో చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చిందనీ, ఫుల్‌లెంగ్త్ రోల్ చేయాలనీ, అందుకోసం యాక్షన్, డాన్స్ కూడా నేర్చుకున్నానన్నారు. నటుడిగా ఉన్న కోర్కెను తన భార్యతో వ్యక్తం చేయగా ఆమె తన మామగారైన కృష్ణగారికి చెప్పడం, ఆయన సూచనలుచేయడం జరగాయన్నారు.
ఆ తర్వాత నమ్రత, మహేష్‌బాబు కూడా తను చేసిన ఫైట్స్, డాన్స్ సీడీని చూసి ప్రశంసించడం జరిగాయన్నారు. ఏదిఏమైనా సినిమారంగంలో నిలదొక్కుకోవడం అంత ఈజీగా కాదని చెప్పినా చిన్నతనంలోనే నటనపై ఆసక్తి కల్గడంతో ఈ రంగంలో ప్రవేశించానన్నారు. ఇక తమ స్వంత బేనర్‌లో చేయకుండా బయిట బ్యానర్ ఎందు చేస్తున్నారని చాలామంది అడిగారనీ అలా చేస్తే కట్నంకింద చేశారనే జనం అనుకోకుండా బయట బేనర్‌లో చేయడానికి కారణమని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











