స్పీడ్ మీదున్న సుధీర్‌బాబు, అదితిరావుతో రొమాంటిక్‌గా..
Recommended Video

సుధీర్‌బాబు - ఇంద్రగంటి - శ్రీదేవి మూవీస్ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి!సుధీర్‌బాబు హీరోగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఈ సినిమాలో నాయికగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా ఈ సినిమాను నిర్మిస్తోంది.

తొలి షెడ్యూల్ పూర్తి
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ``డిసెంబర్ 11 నుంచి 23 వరకు హైదరాబాద్‌లోతొలిషెడ్యూల్ చేశాం. హీరో ఇంటికి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించాం. ఆర్ట్ డైరక్టర్ రవీందర్ రూపుదిద్దిన హీరో హౌస్ సెట్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఈ సన్నివేశాల్లో ఆ సెట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అవుట్ ఫుట్ చాలా సంతృప్తి కరం గా వస్తోంది.

సంక్రాంతికి టైటిల్ ప్రకటన
జనవరి 1 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. అది కూడా భాగ్యనగరంలోనే ఉంటుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. సంక్రాంతి తర్వాత టైటిల్ ప్రకటిస్తాం.మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం`` అని అన్నారు.

రొమాన్స్, హాస్యం ప్రధానంగా
దర్శకుడు మోహనకృష్ణఇంద్రగంటిమాట్లాడుతూ ``రొమాన్స్, హాస్యం సమ్మిళితమైన కథ ఇది. ఈసినిమాలో హీరో చిల్డ్రన్ బుక్స్ ఇల్లస్ట్రేటర్‌గా నటిస్తున్నారు. అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది. పి.జి.విందా ఫొటోగ్రఫీ హైలైట్ అవుతుంది`` అని చెప్పారు.

నటీనటులు, సాంకేతికవర్గం
సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, నరేశ్, తనికెళ్ల భరణి, నందు,రాహుల్ రామకృష్ణ, పవిత్ర లోకేష్,కాదంబరి కిరణ్, హరితేజ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మేకప్: పి.బాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్. మనోజ్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు, కో డైరక్టర్: కోట సురేశ్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: యస్ . రవీందర్, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేశ్; డైరక్టర్ ఆఫ్ పొటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన- దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.


Click it and Unblock the Notifications











