మహేష్ బావ...‘మాయదారి మల్లిగాడు’
టైటిల్ క్యాచీగా ఉండటంతో పాటు, మామయ్య సినిమా పేరుతో సినిమా తీస్తే మంచి రెస్పాన్స్ వస్తుందనే ఉద్దేశ్యంతో సుధీర్ బాబు స్వయంగా తన తర్వాతి చిత్రానికి ఈ టైటిల్ సెలక్ట్ చేసుకున్నాడట. ఇటీవల విడుదలైన 'ప్రేమ కథా చిత్రమ్'లో కృష్ణ నటించిన 'పచ్చని కాపురం' చిత్రంలోని 'వెన్నలైనా చీకటైనా' పాటను రీమిక్స్ చేయడం సుధీర్ బాబుకు కలిసొచ్చింది. బహుషా ఆ సెంటిమెంటుతోనే మామయ్య సినిమాలపై సుధీర్ బాబు కన్నుపడినట్లు స్పష్టమవుతోంది.
కాగా...సుధీర్ బాబు హీరోగా రూపొందబోయే 'మాయదారి మల్లిగాడు' చిత్రం ద్వారా హనుమాన్ అనే కొత్త దర్శకుడు వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. రేవన్ కుమార్ ఈచిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 26వ తేదీన ఈచిత్రం ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
కృష్ణ కుటుంబంతో సుధీర్ బాబు బంధుత్వం గురించి మాట్లాడుకుంటే....కృష్ణ చిన్నకూతురు ప్రియదర్శినితో 2006లో సుధీర్ బాబు వివాహం జరిగింది. వీరికి చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం సుధర్ బాబు వయసు 36 సంవత్సరాలు.


Click it and Unblock the Notifications












