twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు కిడ్నాప్ ఐడియా, బావ పనే?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పాపులారిటీ, పబ్లిసిటీ లేని కొత్త వారు తీసే చిన్న సినిమాలు చూసే పరిస్థితి ఇండస్ట్రీలో లేదనే చెప్పాలి. అందుకే ఇలాంటి సినిమాల వైపు ప్రేక్షకులను వచ్చేలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఫిల్మ్ మేకర్స్. అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు 'సూపర్ స్టార్ కిడ్నాప్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలు. మహేష్ బాబును కొడ్నాప్ చేయాలనే కథాంశంతో ఈ సినిమా రాబోతోంది.

     Sudheer Babu behind Mahesh Babu Kidnap poster

    మహేష్ బాబును కిడ్నాప్ చేసే కథ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనడం సహజమే. ఇటీవల విడుదలైన ఈచిత్రం డిజిటల్ పోస్టర్ కూడా మహేష్ బాబు మాస్కులతో ఉన్న వ్యక్తులతో ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ఇలా డిజైన్ చేయాలని ఐడియా ఇచ్చింది మరెవరో కాదు...మహేష్ బాబు బావ సుధీర్ బాబే అని ఫిల్మ్ నగర్ టాక్.

    ఎ.సత్తిబాబు సమర్పణలో లక్కీ క్రియేషన్స్ పతాకంపై చందు పెన్మత్స నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'సూపర్ స్టార్ కిడ్నాప్'. నందు ఆదర్శ్, భూపాల్, పూనమ్ కౌర్, శ్రద్ధాదాస్ నటీనటులు. ఎ.సుశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనే కథతో ఈ సినిమా సాగుతుంది.

    దర్శకుడు మాట్లాడుతూ...కొన్ని ఊహించని సంఘటనల వల్ల చిక్కల్లో పడిన ముగ్గురు యువకులు సూపర్ స్టార్ మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనుకుంటారు. వాళ్లు వేసుకున్న ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసారా? లేదా అనేది కథ. క్రామ్ కామెడీ సినిమా సాగుతుంది. ప్రేక్షకులు ఉత్కంఠకు గురి చేసే విధంగా సినిమా ఉంటుంది అన్నారు.

    English summary
    
 Super star kidnap is an upcoming Crime Comedy telugu film written and directed by Sushanth Reddy. Mahesh's brother-in-law Sudheer Babu with the idea before releasing the poster. Starring Aadarsh, Nandu, Bhupal, Poonam Kaur, Tejaswini Madivada, Vennela Kishore. Banner : Lucky Creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X