Mahesh Babu: ఇండస్ట్రీలోకి మరో వారసుడు... జూనియర్ మహేశ్ బాబు వచ్చేది ఎప్పుడంటే?
ఇండస్ట్రీలోకి వారసులు హీరోలుగా, హీరోయిన్లుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చినవారున్నారు. అయితే సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది వారసులు వచ్చారు. సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నరేష్, రమేష్, మంజుల, నరేష్ తనయుడు నవీన్.. వీరితో పాటు.. కృష్ణ అల్లుడు, మహేశ్ బాబు బావ సుధీర్ బాబు కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక వీరితో పాటు ఇటీవల మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ కూడా వన్ నేనొక్కడినే చిత్రంలో నటించాడు. ఇప్పుడు వీరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు త్వరలో రాబోతున్నాడట. ఆయన ఎవరు.. ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సినిమా ఇండస్ట్రీలో ఒక్కరు హీరోగా సెటిల్ అయితే.. వారి తరాలకు ఈజీగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఎంట్రీ అయితే లభిస్తుంది కానీ.. ఆ తర్వాత వారిని నిలబెట్టేది వారి ప్రతిభే. ఎంతో మంది వారి వారసత్వాన్ని యూజ్ చేసుకుని సినిమాల్లోకి వచ్చినా.. సక్సెస్ కాలేదు. ఇక ఎంతో మంది వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారు ఉన్నారు. వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకరు.
Recommended Video


ఇక సూపర్ స్టార్ కృష్ణ కొడుగ్గా ఎంటర్ అయినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక వీరి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది వారసులు వచ్చారు. రమేష్, నరేష్, మహేశ్ బాబు, మంజుల, సుధీర్ బాబు.. ఇలా చాలామంది ఎంటర్ అయ్యారు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడట. అయితే ఇప్పుడే కాదు.. ఇంకో మూడేళ్ల తర్వాత ఆయన ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. జూనియర్ మహేశ్ బాబు అలియాస్ మహేశ్ మేనల్లుడు చరిత్.
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో 'సుధీర్ బాబు' గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వైవిధ్యమైన కథలు, పాత్రలు చేస్తూ.. అటు మాస్ ఆడియన్స్‌ని, ఇటు క్లాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు సుధీర్ బాబు. అయితే సుధీర్ బాబుకి ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు పేరు చరిత్ మానస్, చిన్న కొడుకు దర్శన్ కాగా.. వీరిద్దరిలో చరిత్ మానస్.. మేనమామ మహేష్ బాబులా ఉంటాడు.

ఇక సోషల్ మీడియాలో ఆ మధ్య చరిత్ వీడియో వైరల్ కూడా అయింది. నడక, రూపం, అన్ని మహేశ్ బాబులా ఉండటంతో.. అందరూ జూనియర్ మహేష్ బాబులా ఉన్నాడంటూ కామెంట్స్ పెట్టారు. చరిత్ సోషల్ మీడియాలో తండ్రిలా జిమ్నాస్టిక్స్, డాన్స్ టాలెంట్స్ తో సోషల్ మీడియాలో అదరగొడుతుంటాడు. ఇక చరిత్ ని చూసిన ప్రతి ఒక్కరు.. సినిమాల్లోకి ఎప్పుడు రాబోతున్నాడు అంటూ ప్రశ్నలు వేస్తుండగా.. సుధీర్ బాబు తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా సుధీర్ బాబు తన భార్య పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా ముందుకు రాగా.. సుధీర్ బాబుకి మళ్ళీ చరిత్ సినీ ఎంట్రీ ప్రశ్న ఎదురు కాగా... దీనిపై స్పందించాడు. సుధీర్ బాబు మాట్లాడుతూ... "ఎక్కడికి వెళ్లినా చరిత్ లాంచ్ గురించే అడుగుతున్నారని చెప్పుకువచ్చారు. ఇంకా రెండుమూడేళ్లు సమయం ఉందని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలిపారు.
కాగా మహేష్ వారసుడు గౌతమ్ ఎంట్రీకి మరో పదేళ్లు పడుతుందని నమ్రత ఇటీవల తెలిపింది. సుధీర్ బాబు మాటలు బట్టి గౌతమ్ కంటే ముందే చరిత్ ఎంట్రీ ఉండబోతుందని అర్థం అవుతుంది.అలాగే తన రెండో కొడుకు దర్శన్ కూడా సినిమాలోకి వస్తాడని, వాడే కృష్ణ గారి ఫేవరెట్ అని సుధీర్ బాబు తెలిపారు. ఇండస్ట్రీలో తమ నెక్స్ట్ జెనరేషన్ గట్టిగానే ఉండబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం హరోంహర, మా నాన్న సూపర్ హీరో సినిమాల్లో నటిస్తున్నట్లు సుధీర్ బాబు చెప్పుకువచ్చాడు.


Click it and Unblock the Notifications











