నా విషయం చెప్పగానే మహేష్ బాబు వణికిపోయాడు: సుధీర్ బాబు

Recommended Video

Nannu Dochukunduvate Movie Press Meet

సినిమా రంగంలో నిలదొక్కుకోవడం అంటే అంతసులభమైన విషయం కాదు. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న చాలా మంది హీరోగా తెరంగ్రేటం చేసి తర్వాత తెరమరుగయ్యారు. ఏళ్ల తరబడి స్ట్రగుల్ అవుతున్నవారు ఉన్నారు. ఇక్కడ స్టార్‌గా వెలిగిపోవాలంటే కేవలం కష్టపడే తత్వం, టాలెంటు మాత్రమే కాదు.... కాస్తంత లక్ కూడా ఉండాలి. కృష్ణ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి వచ్చిన వారిలో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది మహేష్ బాబు మాత్రమే. ఆయన్ను చూసి ఇన్‌స్పైర్ అయి సినిమాల్లోకి వచ్చారు సుధీర్ బాబు. తాజాగా ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి సుధీర్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మహేష్ బాబులో భయం, కంగారు ఉంటుంది.. డౌటే లేదు

మహేష్ బాబులో భయం, కంగారు ఉంటుంది.. డౌటే లేదు

సుధీర్ బాబు స్వయంగా నిర్మించి నటించిన ‘నన్ను దోచుకుందువటే' సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్బంగా మీడియా సమావేశంలో పాల్గొన్న సుధీర్ బాబును.... ‘మీరు ప్రొడ్యూసర్ అవుతానంటే మహేష్ బాబు ఎలా రియాక్ట్ అయ్యారు?' అని ప్రశ్నించారు. దీనికి సుధీర్ బాబు స్పందిస్తూ... ‘‘మహేష్ మంచి యాక్టర్. బయటకు ఏమీ కనిపించనివ్వడు. లోపల భయం, కంగారు ఉంటుంది... డౌటే లేదు.'' అని సమాధానం ఇచ్చారు.

అప్పుడే వణికిపోయాడు

అప్పుడే వణికిపోయాడు

‘‘నేను యాక్టర్‌గా సినిమాల్లోకి వస్తాను అని చెప్పినపుడే.... లోపల వణికిపోయాడు. ఈ రంగంలో కేవలం కష్టపడితే సరిపోదు. చాలా వరకు లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అందుకే నేను సినిమాల వైపు వస్తాను అన్నపుడు భయపడ్డారు అని సుధీర్ బాబు గుర్తు చేసుకున్నారు.

అది ఎలా ఉంటుందో మహేష్ బాబుకు తెలుసు

అది ఎలా ఉంటుందో మహేష్ బాబుకు తెలుసు

సినిమా యాక్టర్లు ఎలా ఉంటారంటే... వంద మంది ముందు తాము నగ్నంగా నిల్చున్నట్లు ఫీలవుతారు. ఎవరైనా కామెుంట్స్ చేసినపుడు ఏ యాక్టర్ అయినా డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు. ఒక వేళ ఫెయిలైతే ప్రపంచం మొత్తం నిన్ను ఫెయిలైన వాడిగా చూస్తుంది. ఆ డిప్రెషన్ అనేది భరించగలగాలి. అది ఎలా ఉంటుందో మహేష్ బాబుకు తెలుసు....అని సుధీర్ బాబు అన్నారు.

 ఇపుడు ఆయన హ్యాపీ అండ్ ప్రౌడ్

ఇపుడు ఆయన హ్యాపీ అండ్ ప్రౌడ్

నేను స్వతహాగా నెమ్మదిగా, మెతగ్గా, తక్కువ మాట్లాడే వ్యక్తిని. ఇండస్ట్రీలోకి వస్తే ఇంకా షెల్‌లోకి వెళ్లిపోతానేమో అని మహేష్ బాబు అపుడు కంగారు పడ్డారు. ఫైనల్లీ ఇపుడు ఆయన నా విషయంలో హ్యాపీ అండ్ ప్రౌడ్.

కేవలం నా సినిమాల కోసమే కాదు

కేవలం నా సినిమాల కోసమే కాదు

నేను మొదలు పెట్టిన ‘సుధీర్ బాబు ప్రొడక్షన్స్' బేనర్ తరతరాలుగా ఉండేలా చూస్తాను. ఒక మంచి కథ వచ్చి నేను సూటవ్వక పోయినా వేరేవారి సూటవుతుంది అనుకుంటే వారికి ఫోన్ చేసి ఫ్లీజ్ చేయండి అని అడుగుతాను. ఇప్పటి వరకు అలాంటివి కథలు రాలేదు, వస్తే తప్పకుండా చేస్తాను అని సుధీర్ బాబు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X