మహేష్ బావ సంచలనం.. కృష్ణ బయోపిక్, అంతా సస్పెన్స్!
Recommended Video

టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్స్ కాలం నడుస్తోంది. ఇప్పటికే చాలా బయోపిక్ చిత్రాలు రెడీ అవుతున్నాయి. కొత్త బయోపిక్ ప్రకటనలు జరుగుతున్నాయి. తాజగా మరో బయోపిక్ గురించి సంచలన ప్రకటన జరిగింది. ఎవరూ ఊహించని విధంగా హీరో సుధీర్ బాబు ఈ ప్రకటన చేశారు. కానీ పూర్తి వివరాలు వెల్లడించకపోవడంతో సస్పెన్స్ నెలకొంది.

సుధీర్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బావ సుధీర్ బాబు ప్రస్తుతం నన్ను దోచుకుందువటే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రచార కార్యకమాలని సుధీర్ ప్రారంభించాడు. సుధీర్ బాబు సొంత నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సంచలన ప్రకటన
ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల కోసం సుధీర్ బాబు ఇటీవల వైజాగ్ కు వెళ్ళాడు. మీడియాతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశాడు. మీరంతా త్వరలో సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ చిత్రం గురించి వార్త వింటారు అని ప్రకటించాడు.

సస్పెన్స్
కానీ ఈ చిత్రంలోకృష్ణ పాత్రలో ఎవరు నటిస్తున్నారు, తానే ఈ చిత్రానికి నిర్మాతగా మారుతున్నాడా అనే ఆసక్తికర విషయాలు రివీల్ చేయలేదు. టాలీవుడ్ లెజెండరీ నటులలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. అత్యధిక చిత్రాల్లో హీరోగా నటించిన ఘనత ఆయన సొంతం.

కృష్ణ అభిమానులకు
సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు ఈ వార్త పండుగలాంటిది అని చెప్పొచ్చు. ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందుతోంది. ఇటీవల లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ మహానటి విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











