మహేష్ బావ ‘గాలి’ తిరుగుడు!
'ఎస్‌ఎంఎస్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన మహేష్ బాబు బావ మరిది సుధీర్ బాబు మంచి జోరుమీద దూసుకెలుతున్నాడు. అతని తొలి చిత్రం కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాక పోయినా....పెర్పార్మెన్స్ పరంగా సుధీర్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మంచి భవిష్యత్ ఉన్న హీరో అని విమర్శకులు సైతం ప్రశంసించారు. అందుకు తగిన విధంగానే సుధీర్ బాబుకు అవకాశాలు కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం సుధీర్ బాబు 'అగ్గిపుల్ల' అనే చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి గతంలో 'రక్ష' అనే చిత్రానికి దర్శకత్వం వహించిన వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈచిత్రంలో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపింబచోతున్నాడు. ఇక ఈ చిత్రంలో తను యాక్షన్ హీరోగా సెటిలవుతానని సుధీర్ బాబు ఆశగా ఉన్నారు. వంశీ కృష్ణ సైతం తనపై పడ్డ హర్రర్ ముద్రను చెరిపేసుకుని ఈ చిత్రంతో మెయిన్ స్ట్రీమ్ దర్శకులలో కలవాలనుకుంటున్నారు.
తాజాగా సుధీర్ బాబు ఖాతాలో మరో ప్రాజెక్టు వచ్చి చేరింది. 'ఈ రోజుల్లో' దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రానికి సుధీర్ బాబు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈచిత్రానికి 'గాలి' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications
