ఎస్ఎంఎస్ సుధీర్ బాబు కొత్త సినిమా
సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడిగా, మహేష్ బాబు బావగా నటుడిగా పరిచయమైన యంగ్ హీరో సుధీర్ బాబు తన తొలి చిత్రం 'ఎస్ఎంఎస్' ద్వారా మంచి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. వినోదాత్మకంగా సాగిన చిత్రం ముఖ్యంగా యూత్ కి బాగా నచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా సినిమా మంచి ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా సుధీర్ బాబు నటన, రెజీనా గ్లామర్ సినిమాకు ప్లస్సయ్యాయి.
ఆ మధ్య జరిగిన సినిమా సక్సెస్ మీట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ...చిన్న సినిమాగా తాము చేసిన 'ఎస్.ఎం.ఎస్.' విడుదలైన రోజు అన్ని థియేటర్లూ ఫుల్ అవడం అనూహ్యమన్నారు. మావయ్య (కృష్ణ), మహేశ్ వల్ల సినిమాకి అంచనాలు వచ్చాయనీ, వారి అభిమానులు చూపించిన ఆదరం వల్లే సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయనీ ఆయనన్నారు. సూపర్‌గుడ్ మూవీస్ అధినేత ఆర్.బి. చౌదరి సమర్పణలో వేగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విక్రమ్‌రాజు నిర్మించిన 'ఎస్.ఎం.ఎస్.' సినిమా ఇటీవల విడుదలైంది.
తాజాగా ఈ యువ హీరో మరో చిత్రాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇటీవల మనోజ్ హీరోగా రూపొందిన 'మిస్టర్ నూకయ్య' చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.యస్.రావు, సుధీర్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. దీనికి యువ దర్శకుడు వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తాడనీ, దీని షూటింగు త్వరలో ప్రారంభం అవుతుందనీ తెలుస్తోంది. అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











