మహేష్ బాబు బావ 'అగ్గిపుల్ల'లా
ఎస్.ఎమ్.ఎస్ చిత్రంతో పరిచయమైన మహేష్ బాబు త్వరలో అగ్గిపుల్ల గా కనిపించి అలరించనున్నారు. రక్ష చిత్రంతో పరిచయమైన వంశీ కృష్ణ ఆకెళ్ల ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం సుధీర్ సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేస్తున్నాడు. అలాగే ఈ చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఓ యువ నిర్మాత ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక కోసం సెర్చింగ్ జరుగుతోంది.
కృష్ణ అల్లుడుగా పరిచయమైన సుధీర్ బాబు ఈ చిత్రంలో తన డాన్స్ లు,ఫైట్స్ తో పేరు తెచ్చుకున్నారు. తమిళ రీమేక్ గా రూపొందిన ఆ చిత్రం యావరేజ్ గా సెటిలైంది. సుధీర్ బాబు తన దృష్టిని యాక్షన్ ఎంటర్టైనర్స్ పైన పెడుతున్నారు. అటువంటి కథలంటేనే ఆసక్తి చూపుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రంలో తను యాక్షన్ హీరోగా సెటిలవుతానని ఆశగా ఉన్నారు. వంశీ కృష్ణ సైతం తనపై పడ్డ హర్రర్ ముద్రను చెరిపేసుకుని ఈ చిత్రంతో మెయిన్ స్ట్రీమ్ దర్శకులలో కలవాలనుకుంటున్నారు. వర్మ శిష్యుడైన వంశీ కృష్ణ అప్పల రాజు చిత్రానికి సైతం స్క్రిప్టు డిపార్టమెంట్ లో పనిచేసారు.


Click it and Unblock the Notifications











