సుధీర్ బాబు హీరోగా ‘ప్రేమ కథా చిత్రమ్’ షురూ..
హైదరాబాద్: ఎంఎస్ఎస్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు సుదీర్ బాబు హీరో మరో చిత్రం ప్రారంభం అయింది. 'ప్రేమకథా చిత్రం' పేరుతో రూపొందుతున్న ఇందులో నందిత(నీకు నాకు డాష్ డాష్ ఫేం) హీరోయిన్.
ఆర్.పి.ఏ క్రియేషన్స్, మారుతి మీడియా హౌస్ ప్రొడక్షన్స్ బేనర్లపై సుదర్శన్ రెడ్డి, మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ద్వారా... ఈ రోజుల్లో, బస్టాఫ్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన జె. ప్రభాకర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో జరిగింది. తొలి సన్నివేశానికి కృష్ణ క్లాప్ కొట్టగా, విజయనిర్మాల కెమెరా స్విచ్చాన్ చేసారు.
ఈ చిత్రం గురించి మారుతి మాట్లాడుతూ.... 'ఈ సినిమాకు నేనే దర్శకత్వం వహిద్దామని అనుకున్నాను. కానీ ఇతర ప్రాజెక్టుల వల్ల దర్శకత్వ బాధ్యతలు ప్రభాకర్ రెడ్డికి అప్పగించాను. కథ, స్క్రీన్ ప్లే, మాటలు నేనే సమకూర్చాను. సుదీర్ అడగ్గానే ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా డిఫరెంట్ గా ఉంటుంది' అని తెలిపారు.
ఈ చిత్రంలో ఇంకా... ప్రదీప్, హాసిక, అదుర్స్ రఘు, ఏలూరు శ్రీను, రణధీర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: గోవింద్, సంగతం: జేబీ, ఎడిటింగ్: ఉద్ధవ్, నిర్మాతలు: మారుతి, సుదర్శన్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే, మాటలు: మారుతి, సినిమాటోగ్రఫీ- దర్శకత్వం: జె. ప్రభాకర్ రెడ్డి.


Click it and Unblock the Notifications












