నిజాయితీగా ప్రయత్నిస్తున్నా.. రాజమౌళి ట్వీట్‌పై సుధీర్‌బాబు
అందాల తార అదితిరావు హైదరీ, యువ హీరో సుధీర్ బాబుతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన సమ్మోహనం చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ రూపొందించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొన్న సంగతి తెలిసిందే. గత మూడువారాలుగా ప్రేక్షకుల మన్ననలను అందుకొంటున్న సమ్మోహనం చిత్రంపై దర్శక ధీరుడు రాజమౌళి ట్విట్టర్‌లో స్పందించారు.
ఆలస్యంగా సమ్మోహనం చూశాను. అదితిరావు హైదరీ, సుధీర్ బాబు బాగా నటించారు. సీనియర్ నటుడు నరేష్ ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఆలస్యమైనప్పటికీ.. చిత్ర యూనిట్‌కు నా అభినందనలు అని ట్వీట్ చేశారు.

రాజమౌళి ట్వీట్‌కు సుధీర్ బాబు స్పందిస్తూ.. నిజాయితీగా నటుడిగా నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను. అదే మాదిరిగా నా చిత్ర యూనిట్ కృషి చేసింది. మా సినిమాపై ప్రశంసలు కురిపించిన రాజమౌళికి నా థ్యాంక్స్ అని సుధీర్ బాబు రీట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











