ఒకేసారి ఐదు సినిమాలు: అసలు హీరోగా పనికి రాడన్నారట, ఇప్పుడు తానేంటో చూపించాడు

సుధీర్ బాబు తాజాగా టాలీవుడ్ ఆశ్చర్యపోయే ప్రకటన చేశాడు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఐదు కొత్త సినిమా ప్రాజెక్టులు చేపట్టానని తెలిపాడు.

తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటిన యంగ్ హీరో సుధీర్ బాబు.. ఎస్.ఎం.ఎస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తరువాత ప్రేమకథ చిత్రం సినిమా సూపర్ హిట్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సరికొత్త పాత్రలతో కెరీర్‌లో దూసుకుపోతున్న సుధీర్ బాబు బాలీవుడ్ లో కూడా ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. ఇటీవల శమంతకమణిలో నలుగురు హీరోల్లో ఒకరిగా కనిపించిన సుధీర్ బాబు.. మరో మల్టీ స్టారర్ సినిమా వీర భోగవసంత రాయలు లో నటిస్తున్నాడు.

Recommended Video

Mahesh Babu : మహేష్ బాబు @99 : చిన్నారులకు హార్ట్ సర్జరీ | Oneindia Telugu
 శమంతకమణి

శమంతకమణి

సుధీర్ బాబు ఏకంగా ఐదు ప్రాజెక్టుల వివరాలని ప్రకటించి అందరికి షాకిచ్చాడు. ఇటీవల శమంతకమణి అనే మల్టీస్టారర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పటి వరకు 7 సినిమాలు చేశాడు. తన ఎనిమిదో చిత్రాన్ని నూతన దర్శకుడు ఇంద్రసేనతో కలిసి చేయనున్నాడట. ఈ చిత్రం కొత్త తరహాలో ఉంటుందని టాక్.

తండ్రి సెంటిమెంట్ తో నిండిన ప్రేమ కథ

తండ్రి సెంటిమెంట్ తో నిండిన ప్రేమ కథ

సుధీర్ బాబు తాజాగా టాలీవుడ్ ఆశ్చర్యపోయే ప్రకటన చేశాడు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఐదు కొత్త సినిమా ప్రాజెక్టులు చేపట్టానని తెలిపాడు. తన 8వ చిత్రాన్ని నూతన దర్శకుడు ఇంద్రసేన తెరకెక్కించనుండగా, 9వ సినిమాకు రాజశేఖర్‌ దర్శకత్వం వహించనున్నారు. దీనికి నిర్మాత సుధీరే కావడం విశేషం. ఇది తండ్రి సెంటిమెంట్ తో నిండిన ప్రేమ కథ అని సుధీర్ తెలిపాడు.

బాలీవుడ్ నటి అదితీరావ్ హైదరి

బాలీవుడ్ నటి అదితీరావ్ హైదరి

ఇక 10 సినిమాను ‘జెంటిల్‌మెన్‌' హిట్‌ కాంబినేషన్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, శివలెంక కృష్ణప్రసాద్‌ లతో చేయనున్నాడు. ఇందులో హైదరాబాదీ అయిన బాలీవుడ్ నటి అదితీరావ్ హైదరి నటించనుంది. ఇది అనూహ్యమైన కథాంశమని, ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్తతరం ప్రేమకథా చిత్రమని ఇంద్రగంటి తెలిపారు.

ఏప్రిల్‌ లో విడుదల

ఏప్రిల్‌ లో విడుదల

దీనిని శ్రీదేవీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దీని షూటింగ్ డిసెంబరు రెండోవారంలో ప్రారంభం కానుండగా, ఏప్రిల్‌ లో విడుదల అవుతుంది. ఇక తన 11వ చిత్రం గురించి పెద్దగా వెల్లడించని సుధీర్ బాబు.. దాని గురించి అందరికీ తెలుసని, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు.

 హర్షవర్థన్‌ దర్శకత్వంలో

హర్షవర్థన్‌ దర్శకత్వంలో

ఇది ద్విభాషా చిత్రమని క్లూ ఇచ్చాడు. దీనిని పుల్లెల గోపీచంద్ బయోపిక్ గా భావిస్తుండగా, తన 12వ సినిమా రచయిత హర్షవర్థన్‌ దర్శకత్వంలో లవ్‌ థ్రిల్లర్‌ గా రూపొందనున్నట్టు చెప్పాడు. దీని షూటింగ్ పూర్తిగా యూఎస్ లో జరుగనున్నట్టు వెల్లడించాడు. ఇది కూడా ద్విభాషా చిత్రమే కావడం విశేషం.

 విలన్ గా ఆకట్టుకున్నాడు

విలన్ గా ఆకట్టుకున్నాడు

టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ తో కలిసి సుధీర్ బాబు 'భాగీ' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. స్వతహాగా బాడీ బిల్డర్ అయిన టైగర్ ష్రాఫ్ కు సుధీర్ బాబు టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. కరకు విలన్ గా ఆకట్టుకున్నాడు. దీంతో హిందీలో కూడా సుధీర్ బాబుకి మార్కెట్ ఏర్పడింది.

హీరో లక్షణాలు లేవన్నాడట

హీరో లక్షణాలు లేవన్నాడట

సూపర్ స్టార్ క్రిష్ణ అల్లుడిగా,మహేష్ బాబు బావగా సుపరిచితుడే. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సుధీర్ బాబు సినిమాలకు పనికిరాడంటూ , సుధీర్‌కు హీరో అవ్వాల్సిన లక్షణాలు అస్సలే లేవని, సినిమాలకు పనికిరానీ పీసంటూ చెప్పేశాడట డైరెక్టర్ కృష్ణ వంశీ.

బాలీవుడ్‌లో బాఘీ

బాలీవుడ్‌లో బాఘీ

ఆ డైరెక్టర్ మాటలకు చాలా బాధపడ్డాడట.. అవమానంగా భావించిన సుధీర్ బాబు పట్టువిడువకుండా.. సినిమా, సినిమాకు డిఫరెంట్ స్టోరీలతో, నటనతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్‌లో బాఘీ సినిమాలో విలన్‌గా చేసి మంచి మార్కులే తెచ్చుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X