»   » హీరో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్...(ఫోటోలు)

హీరో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కృష్ణారెడ్డి గంగదాసు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆడు మగాడ్రా బుజ్జీ'. సుధీర్‌బాబు, పూనం కౌర్, అస్మితా సూద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులకు కనిపించబోతున్నాడు. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి. సినిమా టైటిల్ పేరులోనే ఇది యాక్షన్ సినిమా అని స్పష్టం అవుతోంది. అందుకు తగిన విధంగానే సుధీర్ బాబు పర్ ఫెక్టుగా సిక్స్ ప్యాక్ బాడీ బిల్ట్ చేయడం గమనార్హం.

ప్రస్తుతం 'ఆడు మగాడ్రా బుజ్జీ' చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. ఇపుడు నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకునిగా పరిచయమవుతున్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు

డైలాగ్ నుంచి పుట్టిన టైటిల్

డైలాగ్ నుంచి పుట్టిన టైటిల్


పాటల్లోంచి సినిమా పేర్లు పుట్టడం సాధారణమే. కానీ మాటల్లోంచి పుట్టడం కాస్త కొత్తే. అలా పేరుపెట్టుకున్న సినిమానే 'ఆడు మగాడ్రా బుజ్జి'. ఇది మహేష్ బాబు చిత్రం ‘అతడు'లోని డైలాగ్.

నిర్మాత

నిర్మాత


నిర్మాతలు సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి మాట్లాడుతూ "దర్శకుడు కథ చెప్పినట్టే అద్భుతంగా తెరకెక్కించాడు. ఫైట్స్ విషయంలో సుధీర్ బాగా రిస్క్ చేశారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది' అన్నారు.

విడుదల ఎప్పుడు?

విడుదల ఎప్పుడు?


ఈ చిత్రాన్ని తొలుత నవంబర్ 29న విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 6న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

తారగణం, టెక్నీషియన్స్

తారగణం, టెక్నీషియన్స్


సుమన్, నరేష్, సంధ్యా జనక్, లక్ష్మి, రణ్‌ధీర్, సాయి, కృష్ణభగవాన్, పృథ్విరాజ్, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ, కథ: కృష్ణాడ్డి గంగదాసు, లంకపల్లి శ్రీనివాస్, కెమెరా: శాంటోనియో ట్రిజియో, పాటలు: పద్మశ్రీ, నక్కా రామకృష్ణ, పాటలు: అనంతశ్రీరామ్, కృష్ణచైతన్య, చిర్రావూరి విజయ్‌కుమార్, నిర్మాతలు:సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణారెడ్డి గంగదాస్.

English summary
Sudheer Babu's Aadu Magaadra Bujji Six Pack stills released. Aadu Magaadra Bujji is an upcoming 2013 Telugu film directed by debutante director Krishnareddy Gangadhasuu and starring Sudheer Babu, Asmita Sood and Poonam Kaur in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu