Don't Miss!
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్‌పై వేటు.. గుజరాత్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
కొత్త ట్రైలర్ కేక పెట్టించింది (వీడియో)
హైదరాబాద్: సుధీర్ బాబు హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భలే మంచిరోజు'. ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై విజయ్, శశి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ని ఆడియో విడుదల జరిగిన సందర్బంగా నిర్మాతలు విడుదల చేసారు. ఈ ట్రైలర్ ర్ చాలా ఆసక్తిగా సాగింది. మీరూ ఓ లుక్కేయండి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
'ప్రేమ కథా చిత్రం', సుధీర్ బాబు హీరోగా, వామిఖ హీరోయిన్గా చేస్తున్న చిత్రం 'భలే మంచి రోజు'. ఈ చిత్రం కథాంశం అంతా ఒక్క రోజులో జరిగేది. ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో, వినోద భరితంగా తెరకెక్కుతోంది.
70ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజరు కుమార్ రెడ్డి, శశిథర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆధిత్యని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'ఉత్తమ విలన్', 'విశ్వరూపం2' చిత్రాలకి ఛాయాగ్రహణం అందించిన షామ్‌దత్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందించారు. సన్ని.ఎమ్.ఆర్ ఈ చిత్రానికి బాణీలు అందించారు.
నిర్మాతలు మాట్లాడుతూ '' ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా అనుకున్న సబ్జెక్ట్ అనుకున్నట్టుగానే తెరకెక్కించాం. సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించారు. కథ, కథనాలని నమ్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సుధీర్ బాబు పరకాయ ప్రవేశంలా ఇన్వాల్వ్ అయ్యి మరీ నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది'' అని అన్నారు.
కెమెరా- షామ్‌దత్, సంగీతం- సన్ని.యమ్. ఆర్, ఆర్ట్- రామకృష్ణ, మాటలు-అర్జున్ అండ్ కార్తిక్, ఎడిటింగ్-యమ్.ఆర్.వర్మ, పి.ఆర్.వో- ఏలూరు శ్రీను, కో-డైరక్టర్- శ్రీరామ్ రెడ్డి, నిర్మాతలు-విజయ్‌కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి, దర్శకత్వం- శ్రీరామ్ ఆదిత్య.