twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుధీర్‌బాబు 'మాయదారి మల్లిగాడు' లేటెస్ట్ ఇన్ఫో

    By Srikanya
    |

    హైదరాబాద్ : సుధీర్‌బాబు హీరోగా 'మాయదారి మల్లిగాడు' పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. పూర్ణ హీరోయిన్. హనుమ ముప్పరాజు దర్శకత్వం వహిస్తున్నారు. యం.రేవన్‌కుమార్‌ నిర్మాత. ఈ నెల 28 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది.

    దర్శకుడు మాట్లాడుతూ ''వినోద ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది. భావోద్వేగాలు, యాక్షన్‌ అంశాలకూ చోటుంది. అల్లరి పిల్లాడిగా సుధీర్‌బాబు చేసే సందడి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటిల్లిపాదినీ మెప్పించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాము. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ప్రేమ, సెంటిమెంట్, కథానుగుణంగా యాక్షన్ సన్నివేశాలు మిళితమై ఉంటాయి. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది''అన్నారు.

    Sudheer Babu's Mayadari Malligadu info.

    నిర్మాత మాట్లాడుతూ- వినోదమే ప్రధానంగా, సెంటిమెంట్, యాక్షన్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని, సంగీతం చిత్రానికి హైలెట్‌గా నిలిచే ఇందులో మల్లికార్జున్‌గా సుధీర్‌బాబు భావోద్వేగాలతో కూడిన పాత్రను చేయనున్నారని తెలిపారు. ''ఇందులో నేను మల్లికార్జున్‌ అనే పాత్రలో నటిస్తున్నాను''అన్నారు సుధీర్‌బాబు. భావోద్వేగాల సమ్మిళితమైన పాత్రలో నటిస్తున్నట్టు సుధీర్‌బాబు చెప్పారు.

    చంద్రమోహన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, విజయ్, సప్తగిరి, విద్యుల్లేక రామన్, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: రథన్, యాక్షన్: కింగ్ సాల్మన్, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, కెమెరా: బి.ఎల్.సంజయ్, ఆర్ట్: కిరణ్, నిర్మాత: రేవన్ కుమార్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హనుమ ముప్పరాజు.

    English summary
    His celebrations are not over yet but Sudheer Babu is quick to shift focus on his next. After the success of Prema Katha Chitram, the actor has signed another film Mayadari Malligadu to be directed by debutante Hanuman. The film is likely to go on floors towards the end of this month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X