సుధీర్ బాబు ‘మోసగాళ్లు మోసగాడు’ ఫస్ట్ లుక్
హైదరాబాద్: సుధీర్ బాబు హీరోగా తెరకెక్కబోతున్న ‘మోసగాళ్లకు మోసగాడు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. స్వామి రారాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్ బాబు సరసన నందిని అనే కొత్తమ్మాయి హీరోయిన్. చక్రి చిగురుపాటి నిర్మాత. బోస్ నెల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.

1971లో కృష్ణ కౌబోయ్ వేషంలో అదరగొట్టిన సినిమా `మోసగాళ్లకు మోసగాడు`. ఇప్పుడు ఈ టైటిల్‌ని సుధీర్ బాబు సినిమాకు పెట్టడంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. సినిమా పూర్తి వినోదాత్మకంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సుదీర్ బాబు చేస్తున్న సినిమాలకు బావ మహేష్ బాబు, మామ కృష్ణ సినిమాల్లోని డైలాగులు, టైటిళ్ల వాసన ఎక్కువయింది. మొన్నామధ్య మహేష్ బాబు సినిమాలోని పాపులర్ డైలాగ్ 'ఆడు మగాడ్రా బుజ్జీ'ని తన సినిమా టైటిల్ గా సుధీర్ బాబు వాడుకున్నాడు. ఇప్పుడు మావయ్య టైటిల్‌ని వాడుకొంటున్నాడు.


Click it and Unblock the Notifications











