'నన్ను దోచుకుందువటే' టీజర్.. టార్చర్ పెట్టే మేనేజర్‌గా సుధీర్ బాబు!
సుధీర్ బాబు వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. ఈ మధ్యనే సమ్మోహనం చిత్రంతో వచ్చిన సుధీర్ బాబు మంచి విజయాన్ని అందుకున్నాడు. సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ హిట్ గా నిలిచింది. వెనువెంటనే సుధీర్ బాబు మరో చిత్రంతో బిజీ అయిపోయాడు.
ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న నన్ను దోచుకుందువటే చిత్రంలో సుధీర్ బాబు ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా డెబ్యూ హీరోయిన్ నభా నాటాష్ నటిస్తోంది. తాజగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. సుధీర్ బాబు సాఫ్ట్ వేర్ కంపెనీలో మానేజర్ పాత్రలో కనిపిసితున్నాడు. సహచర ఉద్యోగులందరినీ వణికించే మేనేజర్ గా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు.
హీరోయిన్ నభా నాటాష్ క్యూట్ లుక్స్ తో అదరగొడుతోంది. కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లో సుధీర్ బాబే నిర్మిస్తుండడం విశేషం.



Click it and Unblock the Notifications











