ట్విట్టర్ రివ్యూ: నన్ను దోచుకుందువటే.. సుధీర్ బాబు మరో హిట్ కొడతాడా!
Recommended Video

హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం నన్ను దోచుకుందువటే. కొత్త భామ నభా నటేష్, సుధీర్ బాబు జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆర్ ఎస్ నాయుడు ఈ చిత్రానికి దర్శత్వం వహించారు. సమ్మోహనం చిత్రం తరువాత సుధీర్ బాబు మరో సున్నితమైన కథని ఎంచుకున్నాడు. ట్రైలర్, టీజర్స్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ చిత్రంపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా యువత, ఫ్యామిలీ ఆడియన్స్ నన్ను దోచుకుందువటే చిత్రంపై ఆసక్తిగా ఉన్నారు. సుధీర్ సొంత నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీమియర్ షోలు ప్రారంభమైన నేపథ్యంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం..
అంచనాలు లేకుండా
అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. సుధీర్ బాబు కథ ఎంపిక, నటన అద్భుతంగా ఉంది.
ఓవర్సీస్ రెస్పాన్స్
ఓవర్సీస్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సుధీర్ బాబు మరో హిట్టు కొట్టాడు.
అద్భుతమైన వినోదం
ఈ చిత్రంలో అద్భుతమైన వినోదం ఉంది. సుధీర్ బాబు, నభా నటేష్ మధ్య లవ్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
పాజిటివ్ రిపోర్ట్స్
నను దోచుకుందువటే చిత్రానికి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సుధీర్ బాబు వరుస హిట్స్ అందుకున్నాడు.
సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే
నన్ను దోచుకుందువటే చిత్రం యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ ఆకట్టుకునే విధంగా లేదు.
ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే
నన్ను దోచుకుందువటే చిత్ర ఫస్ట్హాఫ్ చాలా బావుంది.
శ్రీమంతుడు రెఫరెన్స్
నన్ను దోచుకుందువటే చిత్రంలో శ్రీమంతుడు రెఫరెన్స్ ఉంది. ఆ సన్నివేశాన్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.
నభా నటేష్ నటన
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నభా నటేష్ పాత్ర ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఫస్ట్ హాఫ్ ని అద్భుతంగా మలిచాడు.
ఒకసారి చూడొచ్చు
నన్ను దోచుకుందువటే చిత్రం బావుంది. ఒకసారి చూడవచ్చు.
ప్రతి సన్నివేశం
ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు. సుధీర్ బాబు తన పాత్రలో అద్భుతంగా నటించాడు. నభా నటేష్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











