మహేష్ బాబు బావ.... షాకింగ్ ఫోటో!
మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఇప్పటికే 'ఎస్‌ఎంఎస్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై మంచి భవిష్యత్ ఉన్న హీరోగా పేరు తెచ్చకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ హీరో 'అగ్గిపుల్ల' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
'రక్ష' చిత్రంతో పరిచయమైన వంశీ కృష్ణ ఆకెళ్ల ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం సుధీర్ సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేస్తున్నాడు. ఇందుకోసం చాలా కష్ట పడి వర్కౌట్లు చేస్తున్నారు. అందుకు ఈ ఫోటోనే నిదర్శనం. సిక్స్ ప్యాక్‌ను మించి పోయే రేంజిలో ఉన్న సుధీర్ బాబు బాడీని చూసి అంతా షాక్ అవుతున్నారు.
'అగ్గిపుల్ల' చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈచిత్రానికి ఇంకా నిర్మాత, హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. నిర్మాత ఖరారైన వెంటనే షూటింగ్ ప్రారంభం కానుంది. కృష్ణ అల్లుడుగా పరిచయమైన సుధీర్ బాబు ఎస్ఎంఎస్ చిత్రంలో తన డాన్స్ లు, ఫైట్స్ యూత్‌ని ఆకట్టుకున్నాడు.
కృష్ణ కుటుంబం నుంచి ఇప్పటి వరకు వచ్చిన హీరోల్లో మహేష్ బాబు ఒక్కడే హీరోగా నిలబడటమే కాదు...టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. మరి సుధీర్ బాబు పరిస్థితి ఏమిటో మరికొన్ని సినిమాలు వస్తేగానీ చెప్పలేం. అయితే మహేష్ బాబులా తాను రాణించాలనే తపనతో చాలా కష్టపడున్న సుధీర్ పట్టుదలను అభినందిస్తూ బెస్టాఫ్ లక్ చెబుదాం.


Click it and Unblock the Notifications











