కొరియర్ కుర్రాడి ప్రేమ (ఎస్.ఎమ్.ఎస్ ప్రివ్యూ)
మహేష్ బావ సుధీరబాబు హీరోగా పరిచయమవుతూ రూపొందిన చిత్రం ఎస్.ఎమ్.ఎస్.భీమిలీ కబడ్డి జట్టు దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల అవుతుంది. కథలో కొరియర్ సంస్థలో పనిచేసే యువకుడు శివగా సుధీర్ కనిపిస్తారు. శివ..రైలు ప్రయాణంలో అనుకోకుండా శ్రుతి (రెజీనా) అనే యువతితో పరిచయం ఏర్పడుతుంది. అది స్నేహంగా మారుతుంది. ఆ తరవాత ప్రేమించుకొంటారు. తరవాత చిన్నపాటి తగాదా మొదలవుతుంది. ఎప్పుడూ పోట్లాడుకొనే ఆ ప్రేమికులు చివరకి ఒక్కటయ్యారా లేదా? అనే విషయాన్ని తెరపైనే చూడాలి. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''ఆద్యంతం సరదాగా సాగే ప్రేమకథ ఇది. వినోదం, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. పతాక సన్నివేశాలు చిత్రానికి బలాన్నిస్తాయి. సుధీర్‌బాబు చేసిన నృత్యాలు, పోరాటాలు ప్రధాన ఆకర్షణ''అన్నారు.
సంస్థ: వేగ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.
నటీనటులు: సుధీర్‌బాబు, రెజీనా, రోహిణి, కాశీ విశ్వనాథ్, వెన్నెల కిషోర్, భీమిలి చంటి, సంతోష్, రమేష్ తదితరులు
సమర్పణ: ఆర్.బి.చౌదరి; నిర్మాత: విక్రమ్‌రాజు; దర్శకత్వం: సత్య తాతినేని
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications












