దర్శకుడు వంశీ నా చెడ్డీ బడ్డీ: సుధీర్ బాబు
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది.
మే 9న ప్రపంచవ్యాప్తంగా 'మహర్షి' చిత్రం విడుదలువుతున్న నేపథ్యంలో బుధవారం(మే 1) నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ... ''ఈ ఫంక్షన్‌కు రావడం ఏదో ఫ్యామిలీ పంక్షన్ వచ్చినట్లు ఉంది. దిల్ రాజుగారు, అశ్వినీదత్ గారు, పివిపిగారు నాకు చాలా సన్నిహితులు. దర్శకుడు వంశీ నా చెడ్డీ బడ్డీ అని చెప్పొచ్చు. ఇద్దరం ఒకే రూములో ఉండేవారం. టీజర్లో డైలాగ్ ఉంది.. సక్సెస్ అనేది డెస్టినేషన్ కాదు, జర్నీ అని. రియల్ లైఫ్‌లో మహేష్ ప్రయాణం అలాగే ఉంటుంది. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో కొన్ని బాక్సాఫీసు వద్ద ఆడక పోయినా ఆయన కథలు ఎంపిక బావుంటుంది. ఎంటైర్ టీమ్‌కు గుడ్ లక్. ఒక పండుగాడు, ఒక మురారి మాదిరిగానే రిషి అనే పాత్ర కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను." అన్నారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











