నెగెటివ్ టాక్ వస్తే పెద్ద హీరో సినిమా అయినా పడిపోతుంది: సుధీర్ బాబు
Recommended Video

సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం చిత్రం 'నన్ను దోచుకుందువటే'. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత, హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.... ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ సినిమాగా ఒక 'యూ' సర్టిఫికెట్ మూవీ నిర్మించాను. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్లి చూసే సినిమా ఇది అన్నారు.

నెగెటివ్ టాక్ వస్తే ఎవరూ కాపాడలేరు
సినిమా చూసిన అందరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ సినిమా బావుందని మౌట్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదే నిజమైన సక్సెస్ అని నా ఫీలింగ్. ఈ రోజుల్లో సినిమా బాగోలేదు అంటే గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది. ఎంత పెద్ద హీరో అయినా చిన్న హీరోయినా నెగెటివ్ టాక్ వస్తే సినిమా చూసేవారి సంఖ్య తగ్గిపోతుంది. మంచి మౌత్ టాక్ వచ్చినపుడే గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. మా సినిమా ప్రతి షోకూ చూసే వారి సంఖ్య డబల్ అవుతోందని తెలిసి అంతా చాలా ఆనందపడ్డామని సుధీర్ బాబు అన్నారు.

నమ్మకం ఏర్పడింది
మా సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఒకరు సినిమా బావుందని ట్వీట్ చేశారు. మరుటి రోజు సినిమాలో ఏ సీన్లు బావున్నాయో ఒక్కో సీన్ వివరిస్తూ చెప్పడంతో..... మాకు సినిమాపై నమ్మకం మరింత పెరిగింది అని సుధీర్ బాబు గుర్తు చేసుకున్నారు.

మంచి టీం దొరికింది
నా తొలి ప్రొడక్షన్‌కు ఇంత మంచి టీమ్ దొరికింది. వీరిలో ఎవరూ కూడా నాకు ఇంతకు ముందు పరిచయం లేదు. ప్రతి ఒక్కరినీ వారి టాలెంట్ చూసి తీసుకున్నాను. అందరూ కష్టపడి పని చేయడం వల్లనే ఈ రోజు మాకు ఈ విజయం దక్కింది అన్నారు.

నటీనటులు: సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు
సాంకేతిక వర్గం
డిఓపి - సురేష్ రగుతు
మ్యూజిక్ డైరెక్టర్ - అజనీష్ బి లోకనాథ్
ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్. సాయి వరుణ్
నిర్మాత - సుధీర్ బాబు
స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ - ఆర్ ఎస్. నాయుడు


Click it and Unblock the Notifications











